హెల్త్ టిప్స్

బ‌య‌ట తిండి తింటూ కూడా మీరు ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

సాధారణంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారంతా కూడా హోటళ్ళు, రెస్టరెంట్లు లేదా ఇతర ప్రదేశాలలో వేళకు తమ ఆహారం తీసుకోవలసి వస్తుంది. అటువంటపుడు ఎంపిక చేసే ఆహారాలు ఎలా వుండాలనేది పరిశీలిద్దాం. బరువుతగ్గాలని మీరు ప్రయత్నిస్తున్నా లేదా ఆరోగ్యకర ఆహారాలు తినాలన్నా ఏ ఆహారం పడితే ఆ ఆహారం తీసుకోవద్దు. మీ అవసరాలకు మాత్రమే సరిపడే ఆహారం ఆర్డర్ చేయండి. రైస్ అవసరముంటే రైస్, చపాతి అవసరముంటే చపాతి మాత్రమే తినాలి. అందుబాటులో వున్నవన్ని తినరాదు. మీ అలవాట్లకు తగిన హోటళ్ళు మాత్రమే ఎంచుకోండి. ఒకే ప్రదేశం కి మీరు వెళితే, మీ ఆహార అవసరాలు మీకు తగిన రీతిలో వారు ఏర్పాటు చేస్తారు.

కొన్ని హోటళ్ళలో మీ రుచులు చెపితే దానికి తగినట్లు కూడా తయారు చేసి ఇచ్చే ప్రదేశాలుంటాయి. సలాడ్లు, పండ్లు, మాంసం వంటి వాటితో మీరే సొంతంగా శాండ్ విచెస్ వంటివి తయారు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. మీరు తినే ఆహారం, ప్రత్యామ్నాయాలతో కూడినదై వుండాలి. అంటే కూల్ డ్రింక్స్ తాగే బదులు, తాజా పండ్ల రసం తాగటం వైట్ బ్రెడ్ తినే బదులు బ్రౌన్ బ్రెడ్ తినటం వంటివి చేయాలి. ఒక్కొకపుడు, ఉడికించిన ఆహారాలకంటే కూడా, సహజంగా లభ్యమయ్యే, పండ్లు, కొబ్బరినీరు వంటివి కూడా కడుపు నింపుతాయి.

you can be healthy even if you eat out side food

మీరు ఆర్డర్ చేసే ఐటమ్ లో వుండే పదార్ధాలు ముందుగా తెలుసుకోండి. మీ కవసరమైన రీతిలో తయారు చేయమని కూడా వారికి చెప్పవచ్చు. ఉదాహరణకు మీరు తినే దోశలో ఉల్లిపాయ లేదా అధికమైన నూనె వంటివి మీకు హాని కలిగించవచ్చు. మీకిష్టమైన ఆహారాలు మాత్రమే తినండి. చపాతి, సబ్జి వంటివే తినాలనుకున్నపుడు బ్రెడ్, ఫింగర్ చిప్స్ వంటివి వదిలేయండి. ఈ రకంగా కేలరీలు అధికంగా వుండే మీ ఫేవరెట్ ఆహారం మాత్రమే తినాలి. ఆఫీస్ లో ఆకలితో వున్నపుడు సరైన ఎంపికతో కడుపునిండే పదార్ధాలు అవసరమైనవి మాత్రమే తిని సరిపెట్టండి. అదనపు ఆహారాలు అసౌకర్యం కలిగిస్తాయి.

Admin

Recent Posts