Heart Attack : నేటి తరుణంలో మరణాలకు ఎక్కువగా కారణమయ్యే అనారోగ్య సమస్యల్లో హార్ట్ ఎటాక్ కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అనేక మంది హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. హార్ట్ ఎటాక్ కారణంగా ఎప్పుడూ ఎవరు మరణిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలను పాటివంచడం వల్ల మనం హార్ట్ ఎటాక్ బారిన పడకుండా ఉండవచ్చని వారు చెబుతున్నారు. హార్ట్ ఎటాక్ రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం ఒత్తిడిని, ఆందోళనను తగ్గించుకోవాలి. ఒత్తిడికి గురి అయినప్పుడు కార్టిజాల్ వంటి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.
ఇవి రక్తనాళాలు ముడుచుకునేలా చేస్తాయి. దీంతో రక్తప్రసరణ వ్యవస్థ సన్నగిల్లి గుండెకు రక్తప్రసరణ సరిగ్గా అవ్వదు. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని మన దరి చేరకుండా చూసుకోవాలి. అదే విధంగా రక్తపోటు ఎల్లప్పుడూ అదుపులో ఉంటుంది. రక్తపోటు ఎక్కువగా ఉండడం వల్ల కూడా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక మందులు వాడడంతో పాటు జీవన శైలిని మార్చుకుంటూ బీపీ అదుపులో ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్స్ అదుపులో ఉండేలా చూసుకోవాలి.
చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్స్ పెరగడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఇవి వీటన్నింటిని అదుపులో ఉండేలా చూసుకోవాలి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా చూసుకోవాలి. షుగర్ వ్యాధితో బాధ పడే వారికి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు 60 శాతం ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కనుక రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా జీవన శైలిని మార్చుకోవాలి. ఇక బరువు పెరగకుండా చూసుకోవాలి. అలాగే బరువు పెరిగిన కూడా తగ్గేలా చూసుకోవాలి. బరువు పెరిగే కొద్ది మన శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతూ ఉంటుంది. బరువు పెరగడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థలో అనేక మార్పులు వస్తాయి. శరీరమంతటికి రక్తప్రసరణ చేయడానికి గుండె ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది.
గుండెపై భారం ఎక్కువగా పడి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే గంట నుండి గంటన్నర సమయం వ్యాయామం చేయాలి. అదే విధంగా ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇవి రక్తనాళాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయేలా చేస్తాయి. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే రోజూ 6 నుండి 8 గంటల పాటు నిద్రించాలి. సహజంగా లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు, నూనె ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోకూడదు. ఈ విధంగా ఈ జాగ్రత్తలను తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ మన దరి చేరకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.