చూడగానే నోరూరించేలా ఆహార పదార్థాలు ఉంటాయి కనుకనే.. జంక్ ఫుడ్‌కు ఆ పేరు వచ్చింది. ఏ జంక్ ఫుడ్‌ను చూసినా సరే.. ఎవరికైనా నోట్లో నీళ్లూరుతాయి. అబ్బ… తింటే బాగుండును అనిపిస్తుంది. కానీ మరోవైపు బరువు పెరుగుతామేమో అనే సందేహం కూడా కలుగుతుంది. దీంతో ఇష్టం అనిపించే చిరుతిళ్లకు కూడా కొందరు దూరంగా ఉంటారు. అయితే కింద తెలిపిన సూచనలు పాటిస్తే జంక్ ఫుడ్ తిన్నా కూడా బరువు పెరగకుండా చూసుకోవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే…
1. జంక్ ఫుడ్‌ను వారంలో కనీసం ఒకసారి మాత్రమే తినే అలవాటు చేసుకోండి. ఎందుకంటే వారంలో ఒక్కసారి అంటే.. ఆ ఒక్క రోజు కొంచెం జంక్ ఫుడ్ తింటే మనకు వచ్చే నష్టమేమీ ఉండదు. కానీ ప్రతి 2 రోజులకు ఒకసారి మాత్రం ఆ ఫుడ్ తినకుండా జాగ్రత్త పడండి. వారంలో మీకు నచ్చిన ఏదో ఒక రోజు జంక్ ఫుడ్ తినడం వల్ల మీరు పెద్దగా బరువేమీ పెరగరు.
2. జంక్‌ఫుడ్ లతో ఇచ్చే సాస్‌లను చాలా మంది ఇష్టంగా లాగించేస్తారు. కానీ సాస్‌లు కొద్ది మొత్తంలో తిన్నా మన శరీరంలో అధికంగా క్యాలరీలు చేరుతాయి. కనుక సాస్‌లను తక్కువగా తింటే బరువు పెరగకుండా ఉంటారు.
3. ఏదైనా జంక్ ఫుడ్ తినేముందు నీళ్లు తాగండి. దీంతో ఆ ఫుడ్‌ను తక్కువగా తింటారు. అందువల్ల బరువు పెరగకుండా చూసుకోవచ్చు.
4. జంక్ ఫుడ్ తినేవారు ఎంత తింటున్నాం అనేది చూడకుండా లాగించేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. తక్కువ మొత్తంలో తినాలి. దీంతో బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.
5. సాధారణంగా జంక్ ఫుడ్ తినేవారు పలు రకాల ఐటమ్స్‌ను ఒకేసారి లాగించేస్తుంటారు. కానీ అలా కాకుండా ఒకే ఐటమ్‌ను కొద్ది కొద్దిగా ఎక్కువ సేపు తినే యత్నం చేయండి. దీంతో చాలా తక్కువ తింటారు. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.