సహజంగా ఎక్కువ శాతం మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో రకాలుగా బరువు తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఫలితం లేకపోవడం బాధపడతారు. అయితే అలాంటి వారు ఒక్కసారి సగ్గుబియ్యం ట్రై చేసి చూడండి. ఇప్పుడు చాలా మంది వైద్య నిపుణులు శరీరంలోని అధిక బరువును సహజంగా తగ్గించుకోవడానికి సగ్గుబియ్యం ఒక మంచి మార్గం అని చెబుతున్నారు. సగ్గుబియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి.
ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి. బరువు తగ్గాలని అనుకొనే వారు తరచుగా వాడితే ఖచ్చితంగా శరీరంలో ఉన్న కొవ్వు శాతం తగ్గించుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్లు. పెద్దవారికి, బరువు తగ్గాలనుకునే వారికే కాదు ఈ సగ్గుబియ్యం పసిపిల్లలు, చిన్నపిల్లలకి కూడా అమృతం వంటిదే. సగ్గుబియ్యం తేలికగా జీర్ణం అయ్యే ఆహారం కాబట్టి పాల తర్వాత చిన్న పిల్లలకి తినే ఆహార పదార్థంగా సగ్గుబియ్యాన్ని సూచిస్తారు వైద్యులు.
పోషకాల శాతం ఎక్కువగా ఉండి, ఎటువంటి ఇతరేతర కృత్రిమ పదార్థాలు కలువకపోవం ఇంకా కలిసొచ్చే విషయం. సాధారణంగా మనకు సగ్గుబియ్యాన్ని పాలతో కలిపి తీసుకోవడం తెలిసిందే. అలానే కాదు, నీటితో ఉడికించిన తర్వాత చక్కెర అందులో కలిపి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి తరచుగా సగ్గు బియ్యాన్ని మీ డైట్‌లో చేర్చుకోండి.