ఆలుగడ్డలు అంటే చాలా మందికి ఇష్టమే. వీటితో రక రకాల వంటలను చేసుకుని తింటుంటారు. అయితే ఎవరైనా సరే ఆలుగడ్డలపై ఉండే పొట్టును తీసి పారేస్తుంటారు. కానీ నిజానికి ఆ పొట్టులోనూ అనేక ఔషధగుణాలు, పోషకాలు ఉంటాయి. ఆ పొట్టుతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఆలుగడ్డల పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆలుగడ్డల పొట్టులో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది.
2. ఆలుగడ్డల పొట్టులో యాంటీ మైక్రోబియల్ సమ్మేళనాలు ఉంటాయి. దీని వల్ల బాక్టీరియల్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. శరీరంలోకి సూక్ష్మ క్రిములు రాకుండా చూస్తాయి.
3. ఆలుగడ్డల పొట్టును పేస్ట్‌లా చేసి గాయాలు, పుండ్లపై రాస్తుంటే అవి త్వరగా మానుతాయి.
4. ఆలుగడ్డల పొట్టులో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల వైరస్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధులను తగ్గించుకోవచ్చు.
5. అధిక బరువుతో బాధపడుతున్న వారు ఆలుగడ్డల పొట్టును ఉపయోగించాలి. ఈ పొట్టులో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అవి బరువును తగ్గించి కంట్రోల్‌లో ఉంచుతాయి.
6. ఆలుగడ్డల పొట్టులో ఉండే ఐరన్ శరీరంలోని రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది.
7. ఆలుగడ్డల పొట్టులో ఉండే ఆంథోసయనిన్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీనివల్ల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.