తేనెలో ఎన్నో ఔషధ గుణాలు, పోషక విలువలు ఉంటాయి. దీన్ని రోజూ నేరుగా తీసుకోవచ్చు. లేదా పలు ఇతర పదార్థాలతో కలిపి వాడవచ్చు. దీని వల్ల అనారోగ్య సమస్యలు నయం అవుతాయి. తేనెను గోరు వెచ్చగా ఉండే పాలు, నీళ్లు, ఇతర ద్రవాలు, పదార్థాలతో కలిపి తీసుకుంటే భిన్న రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే తేనెను గోరు వెచ్చగా ఉండే పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు. కానీ దాన్నినేరుగా వేడి చేయరాదు. అవును.. నిజమే. తేనెను వేడి చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనెను వేడి చేసినప్పుడు అందులో HMF పెరుగుతుంది. HMF అంటే Hydroxy Methyl Furfural అని అర్థం. తేనెలో సహజంగానే HMF ఉంటుంది. అయితే దాన్ని వేడి చేయనంత వరకు ఏమీ కాదు. ఆ స్థితిలో తేనెలో HMF స్థాయిలు అతి స్వల్పంగా ఉంటాయి. అందువల్ల ఆ తేనెను తిన్నా మనకు ఏమీ అవదు. అయితే తేనెను వేడి చేయడం వల్ల అందులో ఉండే HMF పరిమాణం పెరుగుతుంది. HMF లెవల్స్ ఎక్కువైన తేనె విషంతో సమానం. అది మనకు అనారోగ్య సమస్యలను కలగజేస్తుంది.
తేనెను వేడి చేయడం వల్ల అందులో HMF స్థాయిలు పెరుగుతాయి. ఈ క్రమంలో అలాంటి తేనెను తింటే మనకు ముక్కు దిబ్బడ, శ్వాసకోశ సమస్యలు, చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలు వస్తాయి. అధికంగా బరువు పెరుగుతారు. కనుక తేనెను ఎట్టి పరిస్థితిలోనూ వేడి చేయరాదు.
ఇక తేనెను వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు చాలా వరకు నశిస్తాయి. కాబట్టి తేనెను వేడి చేయకుండా తినాలి. కానీ వేడి పదార్థాలతో తేనెను కలిపి తీసుకోవచ్చు. అయితే దీనికి కూడా పరిమితి ఉంది. వేడి పదార్థంలో తేనె వేసి ఎక్కువ సేపు ఉంచినా అందులో HMF పెరుగుతుంది. కనుక వేడి పదార్థంలో తేనె కలపగానే వెంటనే తీసుకోవాలి. ఆలస్యం చేయరాదు. చేస్తే HMF స్థాయిలు పెరుగుతాయి. కనుక అలాంటి సందర్భంలో ఆ తేనెను తీసుకోకూడదు.
ఉదాహరణకు.. చాలా మంది వేడి పాలు లేదా వేడి నీటిలో తేనె కలుపుకుని తాగుతారు. అయితే తేనె కలిపిన వెంటనే వాటిని తాగేయాలి. ఆలస్యం చేయడం వల్ల వాటిలో HMF పెరుగుతుంది. ఇది ఏమాత్రం మంచిదికాదు, కనుక వేడి పదార్థాలతో తేనె కలపగానే వెంటనే తీసుకోవాల్సి ఉంటుంది.