సెక్స్ గురించి మాట్లాడుకోవడానికి చాలా ఇబ్బంది పడ్తుంటాం..కానీ తెలుసుకోపోతే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఈ రోజుల్లో ప్రతిదీ ఇంట్లో వాళ్లతో మాట్లాడాలని లేదు. కావలసిన సమాచారం అంతా అరచేతిలోని స్మార్ట్ ఫోన్లో లభ్యమవుతుంది. అయినప్పటికీ కూడా కొంతమందికి ఇంకా ఏదో సంశయమే.సెక్స్ అనేది ఆడ, మగ ఇద్దరు ఆడే ఆట. గెలుపోటముల గురించి పట్టించుకోని ఆట. ఆ ఆట మరింత రసవత్తరంగా ఆడాలంటే కొన్ని పాటించకతప్పదు. అలాంటి వాటిల్లో సెక్స్ కి ముందు తినకూడని ఆహారపదార్దాలు కొన్ని. అవేంటో తెలుసుకోండి.ఉల్లిపాయలు తినడం వలన నోటినుండి దుర్వాసన వస్తుందని మనకు తెలిసిన విషయమే. సెక్స్ కి ముందు ఉల్లిపాయ తినడం వలన కేవలం నోటి నుండి దుర్వాసన రావడం మాత్రమే కాదు శరీరం నుండి చెమట వాసన కూడా విపరీతంగా వస్తుంది. ఇది మన పార్టనర్ కి నచ్చకపోవచ్చు.
ప్రాసెస్ చేయబడిన మాంసం నుండి తయారు చేసిన వంటలను సెక్స్ కి ముందు తినడం వలన ఒక మనిషిలో టెస్టోస్టెరోన్ స్థాయిలను తగ్గించి నష్టాన్ని కలిగించవచ్చు. బీన్స్ లో అజీర్తిగల చక్కెర అణువులను కలిగి ఉండటం వలన జీర్ణం అవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది, అందువల్ల ఇది సెక్స్ సమయంలో కడుపు తిమ్మిరిగా ఉండి వాయువును విడుదల చేయవచ్చు. ఇంకేముంది అంతే, మన పార్టనర్ మూడ్ చెడగొట్టడానికి మనమే ఛాన్స్ ఇచ్చినవారమవుతాం. బీర్ ఫైటోఈస్త్రోజెన్లను కలిగి ఉంటుంది, ప్రత్యేకంగా సెక్స్ కి ముందు సేవించడం వలన మనిషి శక్తిని చాలా వరకు తగ్గిస్తుంది, భాగస్వామితో కలయికకు చాలా అడ్డంకిగా మారుతుంది.
క్యాబేజీ, బ్రోకలీ వంటి కూరగాయలలో కూడా గ్యాస్ కి కారణం అయిన రఫినోస్, సల్ఫేట్లు, వంటి సమ్మేళనాలు కలిగి ఉంటుంది. కాబట్టి సెక్స్ కి ముందు అవి తినకపోవడమే మంచిది. సెక్స్ కి ముందు సొయా లేదా సొయాతో చేసిన పదార్థాలని సేవించడం వలన పురుషులలో సెక్స్ కోరికలను తగ్గిస్తుంది. టెస్టోస్టెరోన్ ఉత్పత్తిని కూడా నిరోధిస్తుంది. కేకులు, మఫిన్లు, మొదలగునవి హార్మోన్లతో కలిసిపోతాయి, అవి అధిక మొత్తంలో చక్కెర కలిగి ఉంటాయి, పురుషులు, మహిళలలో సెక్స్ కోరికలను తగ్గిస్తాయి. కాబట్టి ఆయా ఆహారాలను శృంగారానికి ముందు తినకూడదు.