హెల్త్ టిప్స్

టాయిలెట్ లో ఫోన్ వాడ‌వ‌ద్ద‌ట‌. ఎందుకో తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ల‌నేవి నేడు మ‌న నిత్య జీవితంలో భాగం అయిపోయాయి. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు వాటితోనే చాలా మంది కాల‌క్షేపం చేస్తున్నారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా కొంద‌రు మాత్రం స్మార్ట్‌ఫోన్ల‌ను ఏకంగా టాయిలెట్ల‌లో కూడా వాడుతున్నారు. అవును, చాలా మంది ఇలా చేస్తున్నారు. అయితే నిజానికి ఇలా చేయ‌డం చాలా హానిక‌ర‌మ‌ట‌. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయని డాక్ట‌ర్లు చెబుతున్నారు. మ‌రి స్మార్ట్‌ఫోన్ల‌ను టాయిలెట్ల‌లో ఎందుకు వాడ‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందామా. టాయిలెట్ల‌లో స‌హ‌జంగానే క్రిములు భారీ సంఖ్య‌లో ఉంటాయి. ఈ క్ర‌మంలో టాయిలెట్‌లోకి ఫోన్‌ను తీసుకెళ్లే దానిపై పెద్ద ఎత్తున బాక్టీరియా, వైర‌స్‌లు చేరుతాయి. దీంతో అవి ఫోన్‌పై అలాగే ఉంటాయి. ఇక అవి అక్క‌డి నుంచి మ‌న చేతుల‌కు, అక్క‌డి నుంచి నోట్లోకి, అనంత‌రం క‌డుపులోకి వెళ్తాయి. ఇంకేముందీ ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తాయి. అది రోగాల‌కు దారి తీస్తుంది. క‌నుక టాయిలెట్లోకి స్మార్ట్‌ఫోన్ల‌ను తీసుకెళ్ల‌రాదు.

కాల‌కృత్యాలు తీర్చుకోవ‌డ‌మ‌న‌ది నిత్యం ఎవ‌రైనా చేయాల్సిందే. లేదంటే క‌డుపులో వ్య‌ర్థాలు పేరుకుపోయి అవి విషంగా మారుతాయి. త‌ద్వారా అనారోగ్యాలు సంభ‌విస్తాయి. అయితే కాల‌కృత్యాలు తీర్చుకునే స‌మ‌యంలో వీలైనంత వ‌ర‌కు ప్ర‌శాంతంగా ఉండాలి. దానిపైనే దృష్టి పెట్టాలి. అలా కాకుండా స్మార్ట్‌ఫోన్‌ను వాడుతూ కూర్చుంటే కాల‌కృత్యాలు స‌రిగ్గా తీర్చుకున్నారో లేదో కూడా తెలియ‌దు. కాబ‌ట్టి టాయిలెట్ల‌లో ఫోన్ల‌ను వాడ‌కుండా ఉంటే మంచిది. టాయిలెట్‌లో ఫోన్‌పైకి పెద్ద ఎత్తున వైర‌స్‌లు, బాక్టీరియా చేరుతాయ‌ని చెప్పాం క‌దా. దీని వ‌ల్ల చేతులు క‌డుక్కున్నా మ‌ళ్లీ ఫోన్‌ను ప‌ట్టుకుంటే చేతులు మురికిగా మారుతాయి. బాక్టీరియా, వైర‌స్ క్రిములు చేతుల్లోకి మ‌ళ్లీ చేర‌తాయి. అలాంటి చేతుల‌తో ఆహార ప‌దార్థాల‌ను ముట్టుకున్నా, ఇత‌రుల‌కు షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఇత‌రుల‌ను ముట్టుకున్నా ఆ క్రిములు వారికి వ్యాపిస్తాయి. దీంతో అవ‌త‌లి వ్య‌క్తుల‌కు కూడా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక టాయిలెట్ల‌లో ఫోన్‌ను వాడ‌రాదు.

you should not use phone in toilet know why

ఇంట్లో ఉండే టాయిలెట్స్ క‌న్నా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఉండే టాయిలెట్స్‌లో క్రిములు ఇంకా ఎక్కువ సంఖ్య‌లో ఉంటాయి. క‌నుక అలాంటి ప్ర‌దేశాల్లోనైతే ఫోన్ల‌ను అస్స‌లు వాడ‌కూడ‌దు. టాయిలెట్‌లో టాయిలెట్ సీట్‌, డోర్ హ్యాండిల్స్‌, ఫ్ల‌ష్ ట్యాంక్‌, ట్యాప్‌లు వంటి ప్ర‌దేశాల్లో ఎక్కువ బాక్టీరియా ఉంటుంది. క‌నుక వాటిని తాకిన తరువాత శుభ్రంగా చేతుల‌ను క‌డుక్కోవాలి. లేదంటే వాటిని ముట్టుకుని వెంట‌నే ఫోన్ల‌ను తాకితే అప్పుడు కూడా బాక్టీరియా వ్యాపించే అవ‌కాశం ఉంటుంది. క‌నుక టాయిలెట్‌కు వెళ్లి రాగానే చేతుల‌ను క‌చ్చితంగా శుభ్రం చేసుకోవాలి.

Admin

Recent Posts