Liver Detoxify : మన శరీరంలోని అతి పెద్ద అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. మన శరీరానికి శక్తిని అందించేందుకు, విటమిన్లు, మినరల్స్‌ను నిల్వ చేసుకునేందుకు, విష పదార్థాలను బయటకు పంపేందుకు లివర్ ఎంతగానో శ్రమిస్తుంది. అయితే నిత్యం మనం అనుసరించే జీవనశైలితోపాటు పలు ఇతర కారణాల వల్ల కూడా లివర్‌లో కొన్ని సందర్భాల్లో విష పదార్థాలు పెరిగిపోతుంటాయి. దీంతో లివర్ సమస్యలు వస్తుంటాయి. అయితే అలా జరగకుండా ఉండాలంటే కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకోవాలి. దీంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటంటే..
కాఫీని ఎక్కువగా తాగితే అనారోగ్యకరమని వైద్యులు చెబుతుంటారు. అయితే కాఫీని నిత్యం తగినంత మోతాదులో తాగితే అది లివర్‌కు ఎంతో మేలు చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. కాఫీలో ఉండే ఔషధ గుణాలు లివర్ సమస్యలు రాకుండా చూడడంతోపాటు లివర్ క్యాన్సర్‌ను అడ్డుకుంటాయి. అందువల్ల నిత్యం కాఫీని తాగితే లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే లివర్‌లో ఉండే విష, వ్యర్థ పదార్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. దీంతో లివర్ శుభ్రంగా మారుతుంది.
నిత్యం గ్రీన్ టీని సేవించడం వల్ల కూడా లివర్ శుభ్రంగా మారుతుందని, లివర్ సమస్యలు తగ్గుతాయని జపాన్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గ్రేప్‌ఫ్రూట్‌ను తినడం వల్ల కూడా లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. లివర్ క్లీన్ అవుతుంది. గ్రేప్‌ఫ్రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను సంరక్షిస్తాయి. బ్లూబెర్రీలు లేదా క్రాన్‌బెర్రీలను తినడం వల్ల కూడా లివర్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. వాటిల్లో ఉండే ఆంతోసయనిన్స్ అనబడే సమ్మేళనాలు లివర్‌ను సంరక్షిస్తాయి. లివర్‌ను శుభ్రంగా మారుస్తాయి.
నిత్యం ద్రాక్షలను తినడం వల్ల వాటిల్లో ఉండే రిస్వెరెట్రాల్ అనబడే సమ్మేళనం లివర్‌ను సంరక్షిస్తుంది. లివర్‌లోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. దీంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. బీట్‌రూట్ జ్యూస్‌లో ఉండే నైట్రేట్లు, బీటాలెయిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. లివర్‌ను డ్యామేజ్ కాకుండా చూస్తాయి. అందువల్ల నిత్యం బీట్‌రూట్ జ్యూస్‌ను సేవిస్తుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. బాదం, పిస్తాపప్పు లాంటి నట్స్‌ను నిత్యం తింటే వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ లివర్ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. లివర్‌ను శుభ్రం చేస్తాయి. చేపలు, ఆలివ్‌ఆయిల్‌లను తీసుకోవడం వల్ల వాటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివర్‌ను రక్షిస్తాయి. లివర్‌ను శుభ్రం చేస్తాయి.