కీళ్ల నొప్పులు.. ఆర్థరైటిస్ సమస్య.. ఈ సమస్య ఉన్నవారు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. కూర్చున్నా, నిలబడ్డా, వంగినా.. కీళ్లు విపరీతంగా నొప్పికలుగుతుంటాయి. అడుగు తీసి అడుగు పెట్టడం కష్టంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు క్షణ క్షణం నరకం అనుభవిస్తుంటారు. ఈ సమస్య సాధారణంగా వయస్సు మీద పడుతున్న వాళ్లకు వస్తుంది. కానీ ప్రస్తుత తరుణంలో యుక్త వయస్సులోనూ దీని బారిన పడుతున్నారు.
ఆర్థరైటిస్ లో పలు రకాలు ఉంటాయి. అయినప్పటికీ నొప్పి, లక్షణాలు మాత్రం దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఇవి కీళ్లు, ఎముకలకు సంబంధించిన నొప్పులు. అయితే ఈ నొప్పులను తగ్గించేందుకు కింద తెలిపిన రెండు ఔషధాలు బాగా పనిచేస్తాయి.
ఒక టీస్పూన్ మెంతులను తీసుకుని వాటిని ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ నీటిని తాగాలి. అనంతరం ఆ మెంతులను తినేయాలి.
పారిజాత మొక్క చాలా మంది ఇళ్లలో పెరుగుతుంది. దీని పువ్వులు తెలుపు రంగు, నారింజ రంగు తొడిమలతో ఉంటాయి. ఇవి రాత్రి పూట పూస్తాయి. పారిజాత మొక్క ఆకులను 6, 7 తీసుకుని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి. ఆ నీరు సగం అయ్యే వరకు కషాయం కాచుకోవాలి. అలా వచ్చిన కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే తాగేయాలి.
ఈ విధంగా రెండు రకాల పదార్థాలను కీళ్ల నొప్పులకు ఔషధంగా ఉపయోగించవచ్చు. నెల రోజుల పాటు వీటిని వాడితే తప్పక ఫలితం ఉంటుంది. పూర్తిగా తగ్గకపోతే ఇంకో నెల వాడవచ్చు. ఇలా 3-4 నెలల పాటు వాడితే తప్పక ఫలితం ఉంటుంది. అయితే ఈ రెండింటిలో ఏదైనా ఒక దాన్నే ఉపయోగించాలి. రెండింటినీ వాడరాదు.