నిత్యం మనం పాటించే అనేక అలవాట్లు, తినే ఆహారాలు, శరీరం పట్ల చేసే పనుల వల్ల శరీరంలో అనేక వ్యర్థాలు పేరుకుపోతాయి. అందువల్ల వాటిని ఏరోజు కారోజు బయటకు పంపాల్సి ఉంటుంది. శరీరం చాలా వరకు అలాంటి వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతుంది. కానీ అందులో ఇంకా వ్యర్థాలు మిగిలే ఉంటాయి. ఇక కొందరిలో వ్యర్థాలు అసలు బయటకుపోవు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కింద తెలిపిన డిటాక్స్ డ్రింక్స్‌ను నిత్యం పరగడుపునే తాగడం వల్ల శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేసుకోవచ్చు. దీంతోపాటు శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. ఇంకా పలు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
సగం కీర దోసను ముక్కలుగా కట్ చేసి దాంతో జ్యూస్ చేసుకోవాలి. ఆ జ్యూస్‌లో కొద్దిగా నీరు కలిపి అనంతరం అందులో ఒక నిమ్మకాయ రసం పిండి తాగేయాలి. దీన్ని రోజూ తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోవడమే కాదు, చర్మం సురక్షితంగా ఉంటుంది.
ఒక గ్లాస్ నీటిలో ఒక నిమ్మకాయ రసం, 1 టీస్పూన్ పుదీనా ఆకుల రసం కలిపి తాగేయాలి. ఈ డ్రింక్‌తో శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోవడమే కాక జీర్ణ సమస్యలు ఉండవు. జీర్ణ వ్యవస్థ శుభ్రమై మెరుగ్గా పనిచేస్తుంది.
ఒక గ్లాస్ నీటిలో ఒక నిమ్మకాయ రసం, 1 టీస్పూన్ అల్లం రసం కలిపి తాగితే అధిక బరువు తగ్గుతారు. శరీరం శుభ్రంగా మారుతుంది.
పైన తెలిపిన డిటాక్స్ డ్రింక్‌లలో ఏదైనా ఒక డ్రింక్ నే నిత్యం తాగాల్సి ఉంటుంది. చర్మ సమస్యలు ఉన్నవారు మొదటి డ్రింక్ తాగవచ్చు. జీర్ణ సమస్యల కోసం రెండో డ్రింక్ పనిచేస్తుంది. మూడో డ్రింక్‌ను సేవిస్తే అధిక బరువు తగ్గుతారు. అయితే ఈ మూడు డ్రింక్‌లలో దేన్ని నిత్యం తాగినా శరీరం మాత్రం శుభ్రమవుతుంది. వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.