Sorakaya Juice: షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, అధిక బ‌రువు.. మూడింటికి చెక్ పెట్టే సొర‌కాయ జ్యూస్.. ఇలా త‌యారు చేసుకోవాలి..!

Sorakaya Juice: అధిక బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా ? అయితే మీ రోజువారీ ఆహారంలో సొర‌కాయ‌ల‌ను చేర్చుకోవాలి. ఇవి మ‌న‌కు ఎక్క‌డైనా ల‌భిస్తాయి. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వీటితో కూర‌లు, సూప్‌లు చేసుకుని తీసుకుంటారు. అయితే సొర‌కాయ‌లతో జ్యూస్ చేసుకుని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.

adhika baruvu sugar cholesterol ku check pette sorakaya juice

సొర‌కాయ‌ల్లో బి విట‌మిన్లు, ఫైబ‌ర్, నీరు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇవి శ‌రీర మెట‌బాలిజంను పెంచుతాయి. దీంతోపాటు జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను దృఢంగా మారుస్తాయి. సొర‌కాయ‌లను తీసుకుంటే ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం, ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

సొర‌కాయ జ్యూస్

సొర‌కాయ జ్యూస్‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. వీటిల్లో బి విట‌మిన్లు, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. ఇవి బ‌రువును త‌గ్గిస్తాయి. అలాగే విట‌మిన్లు ఎ, సి, కె, ఇ, ఫోలేట్‌, ఐర‌న్‌, మెగ్నిషియం, పొటాషియం వంటి ఇత‌ర పోష‌కాలు కూడా సొర‌కాయ‌ల్లో ఉంటాయి. అందువ‌ల్ల సొర‌కాయ జ్యూస్‌ను తాగితే అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. దీంతోపాటు శ‌క్తి ల‌భిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఎంత ప‌నిచేసినా అల‌సిపోరు. రోజూ నీర‌సంగా, అల‌స‌ట‌గా ఉంటుంద‌ని అనుకునేవారు సొర‌కాయ‌ల‌ను జ్యూస్‌గా చేసుకుని తీసుకుంటే శ‌క్తి ల‌భిస్తుంది. ఇక డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ఈ జ్యూస్ ఎంత‌గానో మేలు చేస్తుంది. షుగ‌ర్ లెవ‌ల్స్, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకోవ‌చ్చు.

ఇంట్లోనే సొర‌కాయ జ్యూస్‌ను ఇలా త‌యారు చేసుకోండి

1 లేదా 2 చిన్న సొర‌కాయ‌ల‌ను తీసుకోండి. వాటిని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయండి. వాటిని జ్యూస‌ర్ గ్రైండ‌ర్‌లో వేసి జ్యూస్ తీయండి. ఆ జ్యూస్‌ను ఒక గ్లాస్‌లో పోయండి. అందులో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి బాగా క‌ల‌పండి. అనంతరం అందులో ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం క‌ల‌పండి. అవ‌స‌రం అనుకుంటే రుచి కోసం త‌గినంత న‌ల్ల ఉప్పును క‌లుపుకోవ‌చ్చు. దీంతో జ్యూస్ రెడీ అవుతుంది. దీన్ని ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ తో తీసుకోవ‌చ్చు. లేదా ప‌ర‌గ‌డుపున కూడా తాగ‌వ‌చ్చు.

సొర‌కాయ‌ల‌తో చేసే ఈ జ్యూస్‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు. కొలెస్ట్రాల్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తాయి. అలాగే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది.

Share
Admin

Recent Posts