Rose Tea : గులాబీ పువ్వులు అనగానే మనకు అందం గుర్తుకు వస్తుంది. దీన్ని అందానికి ప్రతి రూపంగా భావిస్తారు. గులాబీ పువ్వులను సౌందర్య సాధన ఉత్పత్తుల్లో ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం గులాబీ పువ్వును అద్భుతమైన ఔషధంగా చెప్పవచ్చు. ఇది నిజంగా బంగారం లాంటి విలువగలదని ఆయుర్వేదం చెబుతోంది. కనుక గులాబీ పువ్వులను అంత తేలిగ్గా తీసిపారేయకూడదు. దీంతో టీ తయారు చేసుకుని తాగితే అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గులాబీ పువ్వులను సేకరించి వాటి రెక్కలు తెంచి శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని నీడలో ఎండబెట్టాలి. బాగా ఎండి పొడి పొడిగా మారాక వాటిని సేకరించి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసిన ఎండిపోయిన గులాబీ పువ్వుల రెక్కలను ఒక 5-6 తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. 15 నిమిషాల పాటు రెక్కలను సన్నని మంటపై నీటిలో మరిగించాలి. తరువాత ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఈ టీని రోజుకు రెండు సార్లు.. ఉదయం, సాయంత్రం తాగవచ్చు. దీంతో అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
1. గులాబీ పువ్వుల టీని రోజూ తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా సీజనల్ దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి.
2. వేసవిలో ప్రతి ఒక్కరి శరీరం వేడిగా ఉంటుంది. వేసవి తాపం అధికంగా ఉంటుంది. దీంతో శరీరాన్ని చల్లబరుచుకునేందుకు చాలా మంది రకరకాల పానీయాలను తాగుతుంటారు. అయితే వాటికి బదులుగా గులాబీ పువ్వుల టీని తాగవచ్చు. కాకపోతే టీ తయారు చేశాక దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యాక తాగాలి. దీంతో శరీరం చల్లగా మారుతుంది. వేసవి తాపం, వేడి నుంచి బయట పడవచ్చు. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.
3. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఈ టీ అద్భుతమైన ఔషధం అనే చెప్పవచ్చు. దీన్ని రోజూ తాగుతుంటే కీళ్ల నొప్పులతోపాటు కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. శరీరం రిలాక్స్ అయి ప్రశాంతంగా ఉంటుంది. దీంతో హాయి అనిపిస్తుంది. నొప్పులు అన్నీ తగ్గుతాయి.
4. అధిక బరువు, పొట్ట దగ్గరి కొవ్వు అధికంగా ఉన్నవారు గులాబీ పువ్వుల టీని తాగితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇది కొవ్వును కరిగిస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. దీంతో డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు.
5. గులాబీ పువ్వుల టీని తాగడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
6. గులాబీ పువ్వుల టీని తాగడం వల్ల అతి ఆకలి తగ్గుతుంది. ఆకలి అదుపులోకి వస్తుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలు బయటకుపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.