Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Cinnamon Tea For Cholesterol : షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గేందుకు శ్ర‌మ ప‌డ‌కండి.. దీన్ని రోజూ ఉద‌యం తాగండి..!

D by D
November 10, 2022
in డ్రింక్స్‌, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Cinnamon Tea For Cholesterol : మ‌న‌ల్ని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బారిన ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌ని అధ్య‌య‌నాలు తెలియ‌జేస్తున్నాయి. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఆహార నియ‌మాలను పాటిస్తూ నిరంత‌రం మందుల‌ను వాడిన‌ప్ప‌టికి కొంద‌రిలో షుగ‌ర్ నియంత్ర‌ణ‌లోకి రాదు. అలాంటి వారు మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో టీ ని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధిని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు.

షుగ‌ర్ వ్యాధిని నియంత్రించే ఈ టీ ని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీనికి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అలాగే ఈ టీ ని ఎలా ఉప‌యోగించాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టీని త‌యారు చేసుకోవ‌డానికి ఒక టీ స్పూన్ మెంతులను, అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని, నాలుగు ల‌వంగాల‌ను, రెండు యాల‌కుల‌ను, 6 తులసి ఆకుల‌ను, ఒక టీ స్పూన్ ప‌సుపును, రెండు గ్లాసుల నీటిని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక అందులో పైన ప‌దార్థాల‌న్నీ వేసి రెండు గ్లాసుల నీళ్లు ఒక గ్లాస్ అయ్యే వ‌ర‌కు బాగా మ‌రిగించాలి.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Cinnamon Tea For Cholesterol works effectively take daily
Cinnamon Tea For Cholesterol

త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న టీని రోజూ ఉద‌యం టీ తాగే స‌మ‌యంలో తీసుకోవాలి. అలాగే ఈ టీ గోరు వెచ్చ‌గా ఉండేలా చూసుకోవాలి. ఈ టీ ని తీసుకోవ‌డానికి అర గంట ముందు అలాగే తీసుకున్న త‌రువాత అర‌గంట వ‌ర‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు. ఇలా ప‌ది రోజుల పాటు క్ర‌మం త‌ప్పకుండా తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. ఈ టీ త‌యారీలో వాడిన ప‌దార్థాల‌న్నీ కూడా మ‌న వంటింట్లో ఉండేవే. ఈ ప‌దార్థాలు ఔష‌ధ గుణాల‌తో పాటుర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించే గుణాన్ని స‌హ‌జంగానే క‌లిగి ఉంటాయి. ఈ టీ ని తాగ‌డం వల్ల మ‌నం ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది.

అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ క‌రిగి సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ టీని తాగ‌డం వ‌ల్ల ద‌గ్గు, ఆస్థ‌మా వంటి శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే శ‌క్తి కూడా ఈ టీ కి ఉంది. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఈ విధంగా ఈ టీని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌తో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చని నిపుణులు చెబుతున్నారు.

Tags: Cinnamon Tea For Cholesterol
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Flax Seeds Side Effects : అవిసె గింజ‌లు ఆరోగ్య‌క‌ర‌మే.. ఎక్కువ‌గా తీసుకుంటే ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.