రోజూ ఒక కప్పు వెల్లుల్లి ‘టీ’తో.. డ‌యాబెటిస్‌కు చెక్‌..!

టైప్ 2 డ‌యాబెటిస్ అనేది అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల వ‌చ్చే వ్యాధి. ప్ర‌పంచంలో ఏటా కొన్ని కోట్ల మంది ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. డ‌యాబెటిస్‌ను ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యం చేస్తే కిడ్నీలు, గుండె, ఇత‌ర అవ‌య‌వాలు దెబ్బ తినేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవాలి. నిత్యం వైద్యులు సూచించిన మందుల‌ను వాడ‌డంతోపాటు వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం వంటివి చేయాలి. అలాగే నిత్యం ఒక క‌ప్పు వెల్లుల్లి టీని తాగ‌డం వ‌ల్ల కూడా షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

daily one cup of garlic tea can keep control sugar levels

వెలుల్లిలో ఉండే ఔష‌ధ‌గుణాలు క్లోమ‌గ్రంథిలోని బీటా క‌ణాల‌ను ఉత్తేజం చేస్తాయి. దీంతో ఇన్సులిన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. అలాగే శ‌రీరం ఇన్సులిన్‌ను స‌రిగ్గా గ్ర‌హిస్తుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఇక వెల్లుల్లి టీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక పాత్ర‌లో ఒక కప్పు నీటిని పోసి బాగా మ‌రిగించాలి. త‌రువాత ఆ నీటిలో చిన్న అల్లం ముక్క‌, 1 టీస్పూన్ బాగా న‌లిపిన వెల్లుల్లి రెబ్బ‌లు, 1 టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడి వేసి 5 నిమిషాలు ఉంచాలి. దీంతో వాటిలోని సారం అంతా నీటిలోకి చేరుతుంది. త‌రువాత నీరు గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి. నిత్యం ఇలా వెల్లుల్లి టీని ఒక కప్పు మోతాదులో తాగ‌డం వల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. అయితే రుచి కోసం 1 టీస్పూన్ తేనెను కూడా క‌లుపుకోవ‌చ్చు.

వెల్లుల్లి టీని తాగడం వ‌ల్ల కేవ‌లం షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గ‌డం మాత్ర‌మే కాదు, శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

Share
Admin

Recent Posts