Diabetes : డయాబెటిస్ సమస్యతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా చాలా మందిని టైప్ 2 డయాబెటిస్ అవస్థలకు గురి చేస్తోంది. అస్తవ్యస్తమైన జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, ఆందోళన.. కారణంగా టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే దీనికి డాక్టర్లు సూచించిన మందులను వాడడంతోపాటు కింద తెలిపిన విధంగా ఓ జ్యూస్‌ను తయారు చేసుకుని రోజుకు రెండు సార్లు తాగుతుండాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మరి ఆ జ్యూస్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఒక క్యారెట్, ఒక గ్రీన్ యాపిల్ తీసుకుని ముక్కలుగా కట్ చేయాలి. అనంతరం వాటిని మిక్సీలో వేసి జ్యూస్ తీయాలి. అందులో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ అల్లం రసం కలపాలి. ఈ జ్యూస్‌ను ఉదయం, సాయంత్రం ఒక కప్పు మోతాదులో తాగాలి. దీని వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
ఈ జ్యూస్‌లో ఉండే గ్రీన్ యాపిల్, దాల్చిన చెక్క పొడిలు షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. అలాగే క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ, నిమ్మరసంలో ఉండే విటమిన్ సి లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అల్లం రసం జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
ఈ విధంగా ఈ జ్యూస్ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఉండే దాదాపు అన్ని సమస్యలను తగ్గిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ అదుపులోకి వచ్చేస్తాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
ఈ జ్యూస్‌ను రోజూ తాగవచ్చు. మధ్యలో ఆపాల్సిన పనిలేదు. షుగర్ లెవల్స్ అదుపులోకి వచ్చాక.. ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్లీ దీన్ని తాగవచ్చు. రెగ్యులర్‌గా దీన్ని తాగుతుంటే షుగర్ అసలు బాధించదు.