మనకు తాగేందుకు అనేక రకాల హెర్బల్ టీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంట్లోనే మనం హెర్బల్ టీని తయారు చేసుకుంటే మంచిది. బయట మార్కెట్‌లో లభించే హెర్బల్ టీ ల కన్నా మనం ఇంట్లో తయారు చేసుకునే హెర్బల్ టీలే శ్రేయస్కరం. ఈ క్రమంలోనే మన వంట ఇంట్లో ఉండే మూడు పదార్థాలతో హెర్బల్ టీని తయారు చేసుకుని తాగితే దాంతో ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం, వాము, నిమ్మరసం.. ఈ మూడూ అద్భుతమైన పదార్థాలు వీటిల్లో అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అందువల్ల వీటితో హెర్బల్ టీని తయారు చేసుకుని తాగితే ప్రయోజనాలను పొందవచ్చు.
చిన్న అల్లం ముక్క, ఒక టీస్పూన్ వాములను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి ఆ టీ గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీని వల్ల పలు సమస్యలను తగ్గించుకోవచ్చు.
పైన తెలిపిన హెర్బల్ టీని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆకలి లేని వారు తాగితే ఆకలి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్దకం, అజీర్ణం తగ్గుతాయి. అధిక బరువును తగ్గించేందుకు ఈ హెర్బల్ టీ పనిచేస్తుంది. ఈ టీని రోజుకు 2 సార్లు తాగవచ్చు.