డ్రింక్స్‌

రోజూ బ్రేక్‌ఫాస్ట్‌ చేశాక ఈ హెర్బల్‌ టీ తాగితే మంచిది..!

చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేశాక కాఫీ లేదా టీలను తాగుతుంటారు. కానీ వాటికి బదులుగా సహజసిద్ధమైన పదార్థాలతో చేసిన హెర్బల్‌ టీలను తాగితే మంచిది. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ క్రమంలోనే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేశాక తాగాల్సిన హెర్బల్‌ టీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

drink this herbal tea morning after breakfast

హెర్బల్‌ టీ తయారీకి కావల్సిన పదార్థాలు

  • అల్లం ముక్కలు – అర టీస్పూన్‌
  • దాల్చిన చెక్క ముక్కలు – అర టీస్పూన్‌
  • యాలకుల పొడి – చిటికెడు
  • నీళ్లు – ఒక కప్పు
  • పాలు – పావు కప్పు

తయారు చేసే విధానం

ఒక కప్పు నీళ్లను స్టవ్‌ మీద పెట్టి మరిగించాలి. అందులో అర టీస్పూన్‌ తాజా అల్లం ముక్కలు, అర టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడి లేదా ముక్కలు, చిటికెడు యాలకుల పొడి కలపాలి. తరువాత మూత పెట్టాలి. 5 నిమిషాల పాటు మరిగించాలి. స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. కప్పులోకి వడపోసుకుని అందులో పావు కప్పు వేడి పాలు కలిపి తాగేయాలి.

పైన తెలిపిన విధంగా హెర్బల్‌ టీని తయారు చేసుకుని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ అనంతరం తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన అనంతరం పైన తెలిపిన హెర్బల్‌ టీని తాగడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. ఆకలి లేని వారు ఈ టీ తాగితే ఫలితం ఉంటుంది.

2. ఉదయాన్నే కొందరికి వికారంగా, వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి వారు ఈ టీని తాగితే ఉపశమనం పొందవచ్చు.

3. నోట్లో బాక్టీరియా వృద్ధి చెందడం వల్ల నోటి దుర్వాసన పెరుగుతుంది. కానీ ఈ టీని తాగితే నోట్లో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది.

4. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఈ టీని తాగితే మంచిది. త్వరగా బరువు తగ్గవచ్చు.

5. డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ టీని తాగడం వల్ల ఫలితం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts