ఆయుర్వేద ప్రకారం మన శరీరం పంచ భూతాలతో ఏర్పడుతుంది. అగ్ని, భూమి, నీళ్లు, గాలి, ఆకాశం. ఈ క్రమంలోనే అగ్నిని జఠరాగ్ని అని కూడా పిలుస్తారు. ఇది మన జీర్ణక్రియను, మెటబాలింజను క్రమబద్దీకరిస్తుంది. అగ్ని దృఢంగా ఉంటే జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉండే కణాలు నిర్మాణమవుతాయి. వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. అయితే అగ్ని తక్కువగా ఉంటే జీర్ణ సమస్యలు వస్తాయి. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల అగ్నిని పెంచుకోవాలి. ఈ క్రమంలోనే ఆయుర్వేద సూచించే అగ్ని టీ ని తయారు చేసుకుని తాగితే అగ్ని పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి.
అగ్ని టీని తాగడం వల్ల అందులో ఉండే అల్లం, రాక్ సాల్ట్, నిమ్మరసం వంటి పదార్థాలు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. దీన్నే డిటాక్స్ డ్రింక్ అని కూడా పిలుస్తారు. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
మనం తినే ఆహారం శక్తిగా మారే ప్రక్రియను మెటబాలిజం అంటారు. దీంతో శరీరం మనుగడ కొనసాగిస్తుంది. అయితే మెటబాలిజం సరిగ్గా ఉంటేనే మన శరీరం క్యాలరీలను సరిగ్గా ఖర్చు చేస్తుంది. లేదంటే క్యాలరీలు ఖర్చు కావు. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధికంగా బరువు పెరుగుతారు. అయితే అగ్ని టీని తాగడం వల్ల మెటబాలిజం మెరుగు పడుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. ఆ టీ లో ఉండే రాక్ సాల్ట్, మిరప, అల్లంలు మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. ఫలితంగా బరువును తగ్గించుకోవచ్చు.
బరువు తగ్గడమే గోల్‌గా పెట్టుకున్న వారికి అగ్ని టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. అధిక బరువును తగ్గించుకోవచ్చు. శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకి వెళ్లిపోయి బరువు తగ్గేందుకు సహాయ పడతాయి.
మన శరీరంలో అనేక జీవక్రియలు సరిగ్గా నిర్వర్తించబడేందుకు, రోగ నిరోధక శక్తి పెరిగేందుకు విటమిన్ ఎ ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ సి కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. హైబీపీని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. శరీరం ఐరన్‌ను శోషించుకునేలా చేస్తుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అగ్ని టీలో ఉండే పదార్థాలలో విటమిన్ ఎ, సి లు ఉంటాయి. అందువల్ల ఆయా ప్రయోజనాలు కలుగుతాయి.
అగ్ని టీ ని తయారు చేయడం ఎలా ?
కావల్సిన పదార్థాలు – 1 లీటర్ నీళ్లు, చిటికెడు కారం, తురిమిన అల్లం కొద్దిగా, రెండు టేబుల్ స్పూన్ల రాక్ సాల్ట్, 1 టీస్పూన్ నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల తేనె.
తయారు చేసే విధానం – ఒక పాత్ర తీసుకుని అందులో నీటిని పోసి దాంట్లో నిమ్మరసం, తేనె తప్ప అన్ని పదార్థాలను వేసి బాగా మరిగించాలి. 20 నిమిషాల పాటు మరిగించాక స్టవ్ ఆర్పి ఆ మిశ్రమాన్ని వడకట్టాలి. అనంతరం అందులో నిమ్మరసం, తేనె కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఈ టీని రోజుకు ఒక్కసారి తాగితే చాలు, పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365