రోజూ ఉదయాన్నే పరగడుపునే బార్లీ నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా ?

బార్లీ గింజలు మనకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆహారాల్లో ఒకటి. వీటిని నేరుగా వండుకుని తినడం కంటే వీటిని నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని చాలా మంది తాగుతుంటారు. అయితే రోజూ ఉదయాన్నే పరగడుపునే బార్లీ నీళ్లను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ ఉదయాన్నే పరగడుపునే బార్లీ నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా ?

1. బార్లీ నీళ్లను ఉదయం పరగడుపునే తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కడుపు ఉబ్బరం నుంచి బయట పడవచ్చు. జీర్ణక్రియ మెరుగు పడుతుంది.

2. బార్లీ నీళ్లను ఉదయం తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది.

3. అధిక బరువు ఉన్నవారు రోజూ బార్లీ నీళ్లను తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.

4. బార్లీ నీళ్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

5. కొలెస్ట్రాల్‌, షుగర్ లెవల్స్‌ ఎక్కువగా ఉన్నవారు బార్లీ నీళ్లను తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

6. బార్లీ నీళ్లను తాగితే మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. మళ్లీ ఏర్పడకుండా ఉంటాయి.

బార్లీ నీళ్లను ఇంట్లో ఇలా తయారు చేసుకోండి

కావల్సిన పదార్థాలు

  • బార్లీ గింజలు – పావు కప్పు
  • నీళ్లు – 4 కప్పులు
  • ఉప్పు – చిటికెడు
  • తేనె – తగినంత
  • నిమ్మరసం – తగినంత

తయారు చేసే విధానం

పాత్రలో నీటిని తీసుకుని అందులో బార్లీ గింజలను వేసి మరిగించాలి. తరువాత ఉప్పు వేసి 15-20 నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి. తరువాత నీటిని వడకట్టి అందులో నిమ్మరసం, తేనె కలిపి చల్లగా అయ్యాక తాగాలి. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.

Admin

Recent Posts