Liver Clean : 3 రోజుల పాటు దీన్ని తాగండి చాలు.. లివ‌ర్ మొత్తం శుభ్ర‌మ‌వుతుంది..!

Liver Clean : మ‌న శ‌రీరంలోని ముఖ్య‌మైన భాగాల్లో లివ‌ర్ ఒక‌టి. ఇది అనేక ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తినే ఆహారాన్ని జీర్ణం చేయ‌డంతోపాటు మ‌న శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపేందుకు స‌హాయ‌ప‌డుతుంది. అలాగే మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాలను శ‌రీరం గ్ర‌హించేలా చేస్తుంది. దీంతోపాటు శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు స‌హ‌క‌రిస్తుంది. ఇలా లివ‌ర్ ఎన్నో ప‌నుల‌ను చేస్తుంది.

Liver Clean drink this juice for 3 days in week for better results

అయితే రోజూ మ‌నం తినే ఆహారాలు, తీసుకునే ద్ర‌వాలు, పాటించే అల‌వాట్ల వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యం చెడిపోతుంటుంది. దీంతో లివ‌ర్ స‌రిగ్గా ప‌నిచేయ‌దు. ఈ క్ర‌మంలో ఆక‌లి లేక‌పోవ‌డం, తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోవ‌డం, ఫ్యాటీ లివ‌ర్‌, కామెర్లు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక లివ‌ర్‌ను ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకుగాను కింద తెలిపిన డ్రింక్ ప‌నిచేస్తుంది. దీన్ని ఎలా త‌యారు చేసుకోవాలంటే..

ఒక యాపిల్ పండు, సగం కీర‌దోస‌, స‌గం బీట్ రూట్‌, స‌గం క్యారెట్‌, రెండు చిన్న అల్లం ముక్క‌లు తీసుకుని క‌డిగి చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. అనంత‌రం వాటిని మిక్సీలో వేసి జ్యూస్ తీయాలి. అందులో ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం క‌లిపి తాగేయాలి. ఇలా వ‌రుస‌గా మూడు రోజుల పాటు చేస్తే చాలు.. లివ‌ర్ శుభ్రంగా మారుతుంది. అందులో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి.

అయితే దీన్ని వారంలో రెండు రోజులు తీసుకున్నా చాలు.. మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది. పైన తెలిపిన వాటిల్లో ఉండే అనేక పోష‌కాలు లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. శ‌రీరంలో ర‌క్తం ఎక్కువ‌గా త‌యార‌య్యేలా చేస్తాయి. కొలెస్ట్రాల్‌, షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గిస్తాయి. దీంతోపాటు అధిక బ‌రువు కూడా త‌గ్గుతారు. క‌నుక ఈ జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుచుకోవ‌డంతోపాటు పైన తెలిపిన లాభాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. దీన్ని త‌యారు చేసుకోవ‌డం కూడా సుల‌భ‌మే. ఒక‌సారి త‌యారు చేసుకుని ఫ్రిజ్‌లో ఉంచి 3 రోజుల పాటు తాగ‌వ‌చ్చు. లేదా వారంలో 2 రోజులు అప్ప‌టి క‌ప్పుడు త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. దీంతో లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది.

Share
Admin

Recent Posts