Lungs Detox : ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడే వారు ప్రస్తుత కాలంలో ఎక్కువవుతున్నారు. ఈ సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. విపరీతమైన గాలి కాలుష్యం, ధూమపానం, మద్యపానం, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వంటి అనేక కారణాల చేత ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ధూమపానం కారణంగా శ్వాస సంబంధిత సమస్యలతో పాటు లంగ్ క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. సహజ సిద్దంగా కూడా మనం ఊపిరితిత్తులల్లోని మలినాలను, వ్యర్థ పదార్థాలను తొలగించుకోవచ్చు. మన ఇంట్లో ఒక పానీయాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం.
ఈ పానీయాన్ని తాగడం వల్ల 72 గంటల్లోనే ఊపిరితిత్తుల్లో ఉండే మలినాలు తొలగిపోతాయి. ఊపిరితిత్తులను శుభ్రం చేసే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కళాయిలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడయ్యాక అందులో ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ ను వేసి నీటిని కొద్దిగా మరిగించాలి. తరువాత ఇందులో మధ్యస్థంగా ఉండే ఒక ఉల్లిపాయను ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఈ నీటిని 2 నిమిషాల పాటు మరిగించిన తరువాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపును వేసి బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి.
ఈ నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని, రుచి కొరకు తగినంత తేనెను వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్నీ రోజూ ఉదయం పరగడుపున అర గ్లాస్ మోతాదులో తీసుకోవాలి. ఈ చిట్కాను క్రమం తప్పకుండా రెండు నెలల పాటు వాడాలి. ఇలా చేయడం వల్ల పేరుకుపోయిన మలినాలు, వ్యర్థ పదార్థాలు తొలగిపోయి ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. ఈ పానీయాన్ని తాగడం వల్ల దగ్గు, ఆయాసం వంటి శ్వాస సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ చిట్కాను వాడడం వల్ల కాలేయంతో పాటు శరీరంలో పేరుకుపోయిన మలినాలు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా పానీయాన్ని చేసుకుని తాగడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడి ఊపిరితిత్తుల సంబంధిత అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం.