Palleru Kayala Podi Milk : ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే చాలా మంది బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో జీవితాంతం హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇలా వ్యాధుల బారిన పడడానికి మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇటువంటి సమస్యలను ఒక చిట్కా ద్వారా మనం ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల బీపీ, షుగర్ వంటి అనారోగ్యాలను తగ్గించుకోవచ్చా అని మనలో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. ఈ చిట్కాను వాడడం వల్ల ఇవే కాకుండా యూరీనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లను, అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు.
అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఇటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా చూసుకోవచ్చు. మన శరీర ఆరోగ్యాన్ని కాపాడే ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం పల్లేరు కాయలను, పాలను ఉపయోగించాల్సి ఉంటుంది. పల్లేరు చెట్టును మనలో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మనకు వచ్చే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఈ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక కళాయిలో ఒక గ్లాస్ పాలనే తీసుకుని వేడి చేయాలి.
తరువాత ఇందులో 4 పల్లేరు కాయలను పొడిగా చేసి వేసుకోవాలి. తరువాత ఈ పాలను మూడు పొంగులు వచ్చే బాగా మరిగించాలి. తరువాత ఈ పాలను వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో రుచి కొరకు పటిక బెల్లాన్ని లేదా తేనెను వేసి కలిపి తాగాలి. ఇలా తయారు చేసుకున్న పాలు వారానికి 4 సార్లు తాగాలి. ఈ చిట్కా వాడిన ప్రతిసారి పల్లేరు కాయల పొడిని తాజాగా తయారు చేసుకోవాలి. పల్లేరు కాయలు మన శరీరానికి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా పల్లేరు కాయలతో పాలను తయారు చేసి తీసుకోవడం వల్ల కాలేయంలోని మలినాలు తొలగిపోయి కాలేయం శుభ్రపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు కూడా కరుగుతాయి. మూత్రం సాఫీగా జారీ అవుతుంది.
స్త్రీలు ఈ పాలను తాగడం వల్ల బహిష్టు దోషాలు, గర్భాశయ దోషాలు కూడా తొలగిపోతాయి. పల్లేరు కాయలను ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పాలను తాగడం వల్ల కంటి దోషాలు తొలగిపోయి కంటి చూపు మెరుగుపడుతుంది. నోటి సమస్యలు, చిగుళ్ల మరియు దంతాల సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి. పల్లేరు కాయలతో ఈ విధంగా పాలను తయారు చేసుకుని తీసుకోవడం వల్ల అధిక బరువు కూడా తగ్గవచ్చు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వాత, పిత, కఫ దోషాలన్నీ తొలగిపోతాయి.