Belly Fat : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు సమస్య కూడా ఒకటి. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం మాత్రం కనబడక బాధపడే వారు కూడా ఉన్నారు. అధిక బరువు వల్ల ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు కచ్చితమైన ఆహార నియమాలను కలిగి ఉండాలి. ఇది అందరితోనూ సాధ్యమయ్యే పని కాదు. బరువు తగ్గడం అంత సులభంగా అయ్యే పని కాదు.. అని మనలో చాలా మంది భావిస్తూ ఉంటారు.
ఇంట్లో ఒక చక్కని డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి మనం చాలా త్వరగా బరువు తగ్గేలా చేయడంలో ఈ డ్రింక్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ డ్రింక్ ను తాగడం మొదలు పెట్టిన వారం రోజుల్లోనే మన శరీరంలో మార్పు రావడాన్ని మనం గమనించవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఈ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే దీనిని ఎలా ఉపయోగించాలి.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడానికి గాను మనం వంటింట్లో విరివిరిగా వాడే అల్లం, ఉల్లిపాయలను ఉపయోగించాల్సి ఉంటుంది. అల్లం, ఉల్లిపాయలను మనం వంటల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. వీటిని ఉపయోగించడం వల్ల వంట రుచి పెరగడమే కాకుండా మన శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతోపాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గడంలో అల్లం వెల్లుల్లి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.
బరువు తగ్గాలనుకునే వారు ముందుగా ఒక పెద్ద అల్లం ముక్కను, ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకోవాలి. తరువాత వీటిపై పొట్టును తొలగించి శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత వీటిని ముక్కలుగా కట్ చేసి ఒక జార్ లో వేయాలి. ఇందులోనే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక జల్లి గంటెలోకి లేదా శుభ్రమైన కాటన్ వస్త్రంలోకి తీసుకుని దానిలోని రసాన్ని అంతా వేరే గిన్నెలోకి పిండాలి. ఇలా చేయగా వచ్చిన రసాన్ని మనం ఫ్రిజ్ లో ఉంచి నిల్వ కూడా చేసుకోవచ్చు.
అల్లం, ఉల్లిపాయ మిశ్రమం నుండి పిండిన ఈ రసాన్ని 4 లేదా 5 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి కలపాలి. తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని కలపాలి. ఇలా తయారు చేసుకున్న ఈ డ్రింక్ ను ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. మరీ ఎక్కువగా బరువు ఉన్న వారు దీనిని రోజుకు రెండు పూటలా కూడా తీసుకోవచ్చు. ఉదయం పరగడుపున అలాగే సాయంత్రం టీ, కాఫీ లు తాగే సమయంలో.. ఇలా రోజుకు రెండు సార్లు ఈ డ్రింక్ ను తాగడం వల్ల చాలా సలుభంగా, చాలా తక్కువ సమయంలోనే మనం బరువు తగ్గవచ్చు.
ఇలా అల్లం, ఉల్లిపాయలను ఉపయోగించి తయారు చేసిన ఈ డ్రింక్ ను తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు మూత్రాశయ ఇన్ ఫెక్షన్ లు, మొటిమలు, అలర్జీ వంటి చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అధిక బరువుతో బాధపడే వారు ఈ విధంగా అల్లం, ఉల్లిపాయలతో డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండానే చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.