Coconut Milk Rice : కొబ్బ‌రిపాల‌తో అన్నం.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Coconut Milk Rice : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రిని అప్పుడ‌ప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రిని నేరుగా కానీ ప‌చ్చ‌డిగా కానీ లేదా ప‌చ్చి కొబ్బ‌రితో తీపి ప‌దార్థాల‌ను కానీ త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రి నుండి తీసే కొబ్బ‌రి పాల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు.

కొబ్బ‌రి పాల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, శ‌రీరంలోని నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గించ‌డంలో కొబ్బ‌రి పాలు ఎంతో స‌హాయప‌డ‌తాయి. కొబ్బ‌రి పాల‌తో కూడా వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కొబ్బ‌రి పాల‌తో చేసే వంట‌కాల‌లో కొబ్బ‌రి పాల అన్నం కూడా ఒక‌టి. కొబ్బ‌రి పాల అన్నం చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. కొబ్బ‌రి పాల‌తో అన్నాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Coconut Milk Rice very tasty and healthy make in this way
Coconut Milk Rice

కొబ్బ‌రి పాల అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన బియ్యం – అర కిలో, కొబ్బ‌రి కాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 3, దాల్చిన చెక్క – 2, ల‌వంగాలు – 10, యాల‌కులు – 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, జీడి ప‌ప్పు – 10, ఉప్పు – రుచికి త‌గినంత‌, నూనె – 3 టీ స్పూన్స్.

కొబ్బ‌రి పాల అన్నం త‌యారీ విధానం..

ముందుగా కొబ్బ‌రి కాయ‌ల నుండి కొబ్బ‌రిని తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా చేసి జార్ లో వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు జార్ మూత తీసి త‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు ఒక వ‌స్త్రాన్ని తీసుకుని అందులో మిక్సీ ప‌ట్టిన కొబ్బ‌రి మిశ్ర‌మాన్ని ఉంచి చేత్తో పిండుతూ కొబ్బ‌రి పాల‌ను తీసుకోవాలి. బియ్యం ఉడ‌క‌డానికి స‌రిప‌డా కొబ్బ‌రి పాలు రాన‌ప్పుడు అందులో త‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి క‌లుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి కాగిన త‌రువాత దాల్చిన చెక్క‌, యాల‌కులు, లవంగాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత జీడిప‌ప్పును వేసి వేయించాలి.

త‌రువాత ప‌చ్చి మిర్చిని, అల్లం వెల్లుల్లి పేస్ట్ నువేసి క‌లిపి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న కొబ్బ‌రి పాల‌ను, ఉప్పు వేసి క‌లిపి కొబ్బ‌రి పాలను మ‌రిగించుకోవాలి. కొబ్బరి పాలు మ‌రిగిన త‌రువాత నానబెట్టిన బియ్యాన్ని వేసి క‌లిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. అన్నం పూర్తిగా ఉడికిన త‌రువాత మూత తీసి అన్నాన్ని అంతా ఒక‌సారి క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రి పాల అన్నం త‌యార‌వుతుంది. దీనిని నేరుగా లేదా ఏదైనా మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కొబ్బ‌రి పాల అన్నాన్ని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల కొబ్బ‌రి పాల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కొబ్బ‌రి పాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తహీన‌త‌ స‌మ‌స్య త‌గ్గుతుంది. జుట్టు, చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శక్తి కూడా పెరుగుతుంది.

D

Recent Posts