మునగాకులతో పరోటా.. ఆరోగ్యానికి ఎంతో మేలు..!

మునగాకుల వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. మునగాకుల్లో అనేక పోషకాలు ఉంటాయి. వాటి వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. అయితే మునగాకులతో పరోటాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మునగాకులతో పరోటా.. ఆరోగ్యానికి ఎంతో మేలు..!

కావల్సిన పదార్థాలు:

మల్టీ గ్రెయిన్‌ గోధుమ పిండి – ఒక కప్పు

మునగాకు – అర కప్పు

ఉల్లిపాయలు, తరిగినవి – పావు కప్పు

పచ్చిమిర్చి, సన్నగా తరిగినవి – ఒక టీస్పూన్‌

ఉప్పు – పావు టీస్పూన్‌

వాము – పావు టీస్పూన్‌

నూనె – పావు టీస్పూన్‌

తయారు చేసే విధానం:

మునగాకును ముందుగా కడిగి తరువాత అందులో సరిపడా నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుని దించేయాలి. అది చల్లారాక నీటిని పిండేసి ఓ గిన్నెలో తీసుకోవాలి. అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. అర గంట అయ్యాక కొద్దిగా పిండి తీసుకుని పరోటా మాదిరిగా చేసి వేడి పెనం మీద ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. నూనెకు బదులుగా నెయ్యి ఉపయోగిస్తే మేలు. మిగిలిన పిండిని కూడా ఇలాగే పరోటాల్లా చేసుకోవాలి. వాటిని నేరుగా తినవచ్చు. లేదా పల్లీలతో చట్నీ చేసుకుని తినవచ్చు.

మునగాకులో అనేక విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. అవి మనకు పోషణను అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ రాకుండా చూస్తాయి. మధుమేహాన్ని తగ్గిస్తాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మునగాకులలో ఉండే పోషకాలు హైబీపీని, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు మునగాకు వల్ల కలుగుతాయి. అందువల్ల మునగాకును కచ్చితంగా ఏదో ఒక విధంగా తీసుకోవాలి.

Admin

Recent Posts