ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా మంది రకరకాల ఆహారాలను తింటుంటారు. కానీ ఆరోగ్యవంతమైన బ్రేక్‌ఫాస్ట్‌లను తినడం వల్ల మన శరీరానికి శక్తితోపాటు పోషణ కూడా లభిస్తుంది. అలాంటి ఆరోగ్యవంతమైన బ్రేక్ ఫాస్ట్‌లలో కిచ్‌డీ కూడా ఒకటి. దీన్ని అనేక మంది రకరకాలుగా తయారు చేస్తారు. కానీ కింద తెలిపిన విధంగా తయారు చేసుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి.
* దంచిన గోధుమలు – 1 కప్పు
* పొట్టు కలిగిన పెసలు – 1 కప్పు
* మెంతి ఆకులు – 1 కప్పు
* కసూర్ మేథీ – అర టీస్పూన్
* బీన్స్ – గుప్పెడు (కట్ చేసినవి)
* పచ్చి బఠానీలు – గుప్పెడు
* క్యారట్ – 1 లేదా 2 (అవసరాన్ని బట్టి)
* పచ్చి మిరపకాయలు – 3
* కరివేపాకులు – తగినన్ని
* ఆవాలు, జీలకర్ర, ఇంగువ, నల్ల మిరియాల పొడి, పసుపు, ఉప్పు, నెయ్యి – తగినంత
ప్రెషర్ కుక్కర్‌ను తీసుకుని అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. అనంతరం ఆవాలు, జీలకర్ర, ఇంగువ, నల్ల మిరియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత కూరగాయలు వేయాలి. 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అనంతరం దంచిన గోధుమలు, పెసలు వేసి 6 కప్పుల నీటిని పోయాలి. కిచ్‌డీ ఇంకా గుజ్జులా కావాలంటే కొంచెం నీటిని ఎక్కువగా పోయవచ్చు. తరువాత 3 విజిల్స్ వచ్చేలా ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించాలి. దీన్నే కిచ్‌డీ అంటారు. దీన్ని టమాటా చట్నీ, రైతాలతో తినవచ్చు. ఉదయాన్నే వేడి వేడిగా చేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. పలు కూరగాయలు, పప్పులు ఉంటాయి కనుక మనకు పోషకాలు, శక్తి కూడా లభిస్తాయి. చాలా త్వరగా దీన్ని తయారు చేసుకోవచ్చు.