Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు ఆహారం

Jonna Ambali : ఇది మామూలు అంబ‌లి కాదు.. దీన్ని తాగితే ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో తెలుసా..?

D by D
February 6, 2023
in ఆహారం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Jonna Ambali : జొన్న‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో ఇవి ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో వీటి వినియోగం ఎక్కువైంద‌నే చెప్ప‌వ‌చ్చు. జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. జొన్న‌ల్లో క్యాల్షియం, ఐర‌న్, ఫాస్ఫ‌ర‌స్ వంటి వాటితో పాటు పీచు ప‌దార్థాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. చాలా మంది జొన్న‌ల‌తో రొట్టెల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. కేవ‌లం రొట్టెలే కాకుండా ఈ జొన్న‌ల‌తో మనం అంబలిని కూడా త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. జొన్న అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. జొన్న అంబ‌లిని త‌యారు చేసుకోవ‌డం చాలా తేలిక‌. ఈ అంబ‌లిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు.

రుచిగా ఉండ‌డంతో మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జొన్న అంబ‌లిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అలాగే ఈ అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో ఒక క‌ప్పు జొన్న పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో మూడు గ్లాసుల నీళ్లు పోసి ఉండ‌లు లేకుండా క‌ల‌పాలి. ఇందులోనే సైంధ‌వ ల‌వ‌ణాన్ని వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి మ‌ధ్య‌స్థ‌ మంట‌పై క‌లుపుతూ ఉడికించాలి. ఈ అంబ‌లిని 8 నుండి 10 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత దీనిని ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో మిరియాల పొడి, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న అంబ‌లి త‌యార‌వుతుంది.

Jonna Ambali benefits in telugu know how to prepare it
Jonna Ambali

ఈ విధంగా జొన్న పిండితో అంబ‌లిని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. ఈ అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఎముక‌లు ధృడంగా తయార‌వుతాయి. రక్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. అలాగే ఈ అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు తగ్గుతాయి. బ‌రువు తగ్గాల‌నుకునే ఈ అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అలాగే ఈ అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొల‌గిపోతుంది.

గుండె ఆరోగ్యంగా ప‌ని చేస్తుంది. షుగ‌ర్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. అంతేకాకుండా ఈ అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల కండ‌రాలు ధృడంగా త‌యార‌వుతాయి. దేహ ధారుడ్యం కోసం వ్యాయామాలు చేసే వారు ఈ అంబ‌లిని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి త‌గ్గుతుంది. ఈ విధంగా జొన్న‌ల‌తో చేసిన అంబ‌లి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.దీనిని పిల్ల‌ల నుండి పెద్ద వారి వ‌ర‌కు ఎవ‌రైనా ఆహారంగా తీసుకోవ‌చ్చు. జొన్న‌ల‌తో రొట్టెలే కాకుండా ఇలా అంబ‌లిని త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Jonna Ambali
Previous Post

Aritaku Idli : అరిటాకుల ఇడ్లీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తినండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Next Post

Egg Masala Gravy Curry : ఎగ్ మ‌సాలా గ్రేవీ క‌ర్రీని ఇలా చేశారంటే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..!

Related Posts

ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.