Palak Idli : పాలకూర ఇడ్లీ.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Palak Idli : పాలకూరలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. కనుకనే దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతుంటారు. పాలకూరను తినడం వల్ల మనకు పోషకాలు లభించడంతోపాటు అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. అనేక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. పాలకూరను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. అయితే దీంతో ఇడ్లీలను కూడా తయారు చేసుకోవచ్చు. అవి రుచిగా ఉండడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఇక పాలకూర ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Palak Idli very tasty and healthy prepare in this way
Palak Idli

పాలకూర ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..

నానబెట్టిన పెసర పప్పు – అర కప్పు, పాలకూర తరుగు – ముప్పావు కప్పు, తరిగిన పచ్చి మిర్చి – ఒక టేబుల్‌ స్పూన్‌, పెరుగు – ఒక టేబుల్‌ స్పూన్‌, నీళ్లు – రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా.

పాలకూర ఇడ్లీ తయారు చేసే విధానం..

ముందుగా మిక్సీ బౌల్‌లో పెసర పప్పు, పాలకూర, పచ్చి మిర్చి వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని బౌల్‌లోకి తీసుకుని అందులో పెరుగు, ఉప్పు వేసి కలపాలి. అలాగే నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు నూనె రాసి మిశ్రమాన్ని పెట్టుకోవాలి. తరువాత స్టీమర్‌లో ఈ పాత్రలను పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత వాటిని వేడివేడిగా ఉన్నప్పుడు ఏదైనా చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్‌ చేసుకోవచ్చు. ఇలా పాలకూరతో ఇడ్లీలను తయారు చేసుకుని తినడం వల్ల రుచి.. ఆరోగ్యం.. రెండింటినీ పొందవచ్చు.

Admin

Recent Posts