Sesame Laddu : ఈ ల‌డ్డూల‌ను రోజుకు ఒక్క‌టి తినండి.. ఎంతో బ‌లం.. అన్ని పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు..!

Sesame Laddu : నువ్వులు.. ఇవి తెలియ‌ని వారుండ‌రు. ప్ర‌తి ఒక్క వంటింట్లో ఇవి త‌ప్ప‌కుండా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. నువ్వుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఫ్లోటేట్స్, నియాసిన్, థ‌యామిన్, విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ ల‌తోపాటు సోడియం, కాల్షియం, ఐర‌న్, జింక్, మెగ్నిషియం, పొటాషియం వంటి అనేక ర‌కాల మిన‌ర‌ల్స్ కూడా ఉంటాయి. నువ్వుల‌ను మ‌నం వంట‌ల త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటాం. తీపి ప‌దార్థాల త‌యారీలో కూడా నువ్వుల‌ను ఉప‌యోగిస్తారు. కేవ‌లం ఇత‌ర వంట‌కాల త‌యారీలో ఉప‌యోగించ‌డ‌మే కాకుండా ఈ నువ్వుల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం ప‌ది నిమిషాల‌లోనే చాలా రుచిగా ఈ నువ్వుల ల‌డ్డూల‌ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ నువ్వుల ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వుల ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నువ్వులు – ఒక క‌ప్పు, బెల్లం త‌రుము – ముప్పావు క‌ప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్.

Sesame Laddu take daily one for amazing benefits
Sesame Laddu

నువ్వుల ల‌డ్డూల‌ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నువ్వుల‌ను వేసి చిన్న మంటపై నువ్వులు రంగు మారే వ‌ర‌కు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న నువ్వులు కొద్దిగా చ‌ల్ల‌గా అయిన త‌రువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే బెల్లం తురుమును వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల మిశ్ర‌మంలో నెయ్యిని, యాల‌కుల పొడిని వేసి క‌లిపి మ‌న‌కు కావ‌ల్సిన ప‌రిమాణంలో ల‌డ్డూల‌లాగా చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నువ్వుల ల‌డ్డూలు త‌యార‌వుతాయి.

వంట చేయ‌డం రాని వారు కూడా ఈ నువ్వుల ల‌డ్డూల‌ను చాలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. వీటిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 15 నుండి 20 రోజుల పాటు తాజాగా ఉంటాయి. రోజుకు ఒక‌టి లేదా రెండు చొప్పున ఈ నువ్వుల ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, అధిక ర‌క్త పోటును నియంత్రించ‌డంలో నువ్వులు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి.

నువ్వుల‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండ‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా ఉంటాయి. చ‌ర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. శ‌రీరాన్ని క్యాన్సర్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో కూడా నువ్వులు మ‌న‌కు ఉప‌యోగ‌న‌డ‌తాయి. క‌నుక నువ్వుల‌తో ఇలా ల‌డ్డూల‌ను చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

D

Recent Posts