నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, తేనె.. ఇవన్నీ అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నవే. అన్నీ మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అనేక వ్యాధుల నుంచి రక్షణను అందిస్తాయి. అనేక అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఇవన్నీ పనిచేస్తాయి. అయితే వీటితో తయారు చేసే ఒక టానిక్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తీసుకుంటే చాలు, ఎలాంటి రోగం రాకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. మరి ఆ టానిక్‌ను ఎలా తయారు చేయాలంటే..?
కావల్సిన పదార్థాలు
- నిమ్మకాయలు, పొట్టు తీసినవి – 2
- తురిమిన అల్లం – అర కప్పు
- చిన్న ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లి – అర కప్పు
- తేనె – అర కప్పు
తయారు చేసే విధానం
పైన తెలిపిన అన్నింటినీ బ్లెండర్ లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. చిక్కని పేస్ట్‌లా తయారవుతుంది. దాన్ని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టి వారం వరకు వాడుకోవచ్చు.
ఈ టానిక్‌ను ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. తీసుకున్న తరువాత అర గంట వరకు ఏమీ తినరాదు. తాగరాదు. రోజుకు 1 టీస్పూన్ మోతాదులో దీన్ని తీసుకోవాలి. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారు పూటకు ఒకసారి ఒక టీస్పూన్ చొప్పున తీసుకోవచ్చు. మూడు పూటలా తీసుకోవాలి.
ఈ టానిక్‌ను తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అనేక వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. శరీరంలో అధికంగా ఉండే శ్లేష్మం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. వైరస్ ఇన్‌ఫెక్షన్ల వల్ల వచ్చే దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి. బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల వల్ల వచ్చే వ్యాధులు తగ్గుతాయి.