వైట్ రైస్‌ను తినడం వల్ల అధికంగా బరువు పెరుగుతామనే భయం చాలా మందిలో ఉంటుంది. అందువల్ల చాలా మంది వైట్ రైస్ ను తినేందుకు ఆసక్తి చూపించరు. కానీ నిజానికి వైట్ రైస్‌ను తినాల్సిన విధంగా తింటే బరువు పెరగరు. తగ్గుతారు. అందుకు గాను వైట్ రైస్‌ను భిన్న రకాలుగా వండాల్సి ఉంటుంది.
వైట్ రైస్‌లో పోషకాలు ఉంటాయి. బి విటమిన్లు, మెగ్నిషియం, ఇతర పోషకాలు ఉంటాయి. అలాగే గ్లూటెన్ ఉండదు. అందువల్ల వైట్ రైస్ తేలిగ్గా జీర్ణమవుతుంది. బరువు తగ్గేందుకు, మెటబాలిజం పెరిగేందుకు సహాయం చేస్తుంది. కానీ వైట్ రైస్‌ను నేరుగా అలాగే తినరాదు.
వైట్ రైస్‌లో కూరగాయలు వేసి వండి తినాలి. దీని వల్ల ఆ ఆహారం ఆరోగ్యకరంగా మారుతుంది. నేరుగా రూస్ తినరు, కూరగాయలు కూడా అందులో ఉంటాయి, కనుక పోషకాలు లభిస్తాయి. వాటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక కొంచెం తిన్నా చాలు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు.
కూరగాయలను వేసి వండిన అన్నాన్ని తింటే పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉంటారు. అయితే కూరగాయలకు బదులుగా పెసలు వేసి వండిన అన్నాన్ని కూడా తినవచ్చు. పెసలపై పొట్టు తీయరాదు. పొట్టు తీయని పెసలను వేసి అన్నాన్ని వండి తినవచ్చు. ఇలా తిన్నా కూడా బరువు తగ్గుతారు. పోషకాలు లభిస్తాయి.
ఇక అన్నంలో ఒక టీస్పూన్ నెయ్యి లేదా కొబ్బరినూనె వేసి వండి తినవచ్చు. దీంతోనూ పోషకాలు లభిస్తాయి. అయితే అధిక బరువు ఉన్నవారు కొబ్బరినూనె వేసి వండి తినాలి. దీంతో బరువు తగ్గుతారు. షుగర్ పేషెంట్లు కూడా ఇలా అన్నాన్ని పలు విధాలుగా వండుకుని నిర్భయంగా తినవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ పెరగవు.