చింతపండును సహజంగానే మన ఇళ్లలో రోజూ ఉపయోగిస్తుంటారు. చారు, పులుసు, పులిహోర వంటి వాటిల్లో చింతపండును వేస్తుంటారు. అయితే చింత పండే కాదు, చింత గింజల వల్ల కూడా మనకు అనేక లాభాలు కలుగుతాయి. ఈ గింజలతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చింత గింజలను పొడిగా చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. దాంతో రోజూ దంతాలను తోముకోవాలి. దీంతో దంతాలు తెల్లగా మారుతాయి. దంతాలపై ఉండే గార, పాచి సైతం మాయమవుతాయి.
2. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే చింతగింజలను పొడిగా చేసి దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. దీంతో అజీర్ణం తగ్గుతుంది.
3. చింత గింజల్లో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ గింజల పొడిలో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని గాయాలు, పుండ్లపై రాయాలి. ఇలా చేస్తుంటే అవి త్వరగా మానుతాయి.
4. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి చింత గింజలు అద్భుతమైన వరం అని చెప్పవచ్చు. ఈ గింజల పొడిని నీళ్లలో వేసి మరిగించిన డికాషన్‌ను రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు కప్పు మోతాదులో తాగుతుండాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
5. చింత గింజల పొడి డికాషన్‌ను తాగడం వల్ల హైబీపీ సైతం తగ్గుతుంది. ఈ గింజల్లో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది.