Star Anise : పులావ్‌లు, బిర్యానీలు, ఇతర ప్రత్యేకమైన వంటకాలు చేసినప్పుడు సహజంగానే వాటిల్లో అనేక రకాల పదార్థాలను వేస్తుంటారు. వాటిల్లో అనాస పువ్వు ఒకటి. దీన్నే స్టార్ అనిస్ అంటారు. దీన్ని బిర్యానీలు, పులావ్‌లలో వేయడం వల్ల చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం అనాస పువ్వులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అనాస పువ్వులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును పెంచుతుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ పువ్వులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.
2. ఈ పువ్వులో థైమోల్, టెర్పినోల్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల ఈ పువ్వుతో దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి బయట పడవచ్చు. శ్వాస సరిగ్గా ఆడుతుంది. ఊపిరితిత్తుల్లో ఉండే కఫం పోతుంది.
3. చాలా మందికి అప్పుడప్పుడు వికారం, వాంతికి వచ్చినట్లు అనిపించడం వంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి వారు అనాస పువ్వును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
4. మహిళలకు కొందరికి నెలసరి సమయంలో తీవ్రమైన ఇబ్బందులు కలుగుతుంటాయి. అలాంటి వారు ఈ పువ్వును వాడితే ప్రయోజనం ఉంటుంది. అధిక రక్తస్రావాన్ని అరికట్టవచ్చు.
5. మహిళలు అనాస పువ్వును వాడడం వల్ల వారిలో నెలసరి సమస్యలు తగ్గుతాయి. హార్మోన్లు సమతుల్యం అవుతాయి. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.
6. మలబద్దకం, జీర్ణ సమస్యలు ఉన్నవారు అనాస పువ్వును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
7. అనాస పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి వైరస్ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. జ్వరం వచ్చినవారు ఈ పువ్వును తీసుకుంటే జ్వరం త్వరగా తగ్గిపోతుంది.
8. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు అనాస పువ్వును వాడితే ప్రయోజనం ఉంటుంది.
అనాస పువ్వును నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజూ ఒక కప్పు మోతాదులో రోజులో ఎప్పుడైనా తాగాలి. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలను పొందవచ్చు.