Arjuna Tree Bark For Heart : ప్రస్తుత తరుణంలో చాలా మంది హార్ట్ ఎటాక్ బారిన పడి చనిపోతున్నారు. కరోనా అనంతరం ఈ మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో కోవిడ్ టీకా సైడ్ ఎఫెక్ట్ అని చాలా మంది అనుమానిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది. కానీ చిన్న వయస్సులోనే గుండె పోటు వస్తుండడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఎంత ఫిట్‌గా ఉంటున్నప్పటికీ సెలబ్రిటీలు సైతం చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. అయితే హార్ట్ ఎటాక్ అనేది అనేక రకాల కారణాల వల్ల వస్తుంది.
సాధారణంగా గతంలో 50 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే హార్ట్ ఎటాక్‌లు వచ్చేవి. కానీ ఇప్పుడు 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి కూడా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. గుండె ఆరోగ్యంపై శ్రద్ధ చూపించకపోవడం వల్లనే హార్ట్ ఎటాక్‌లు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాయామం చేయకపోవడం, అతిగా తినడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, పొగ తాగడం, మద్యం సేవించడం, రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రించడం, రోజూ ఒకే చోట కూర్చుని పనిచేయడం వంటివన్నీ హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు వెనుక ఉన్న కారణాలు అని చెప్పవచ్చు.
అయితే రోజూ ఒక పొడిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో లైఫ్‌లో హార్ట్ ఎటాక్‌లు వచ్చే చాన్స్‌లు చాలా వరకు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంతకీ ఏంటా పొడి.. అంటే.. అదే అర్జున చెట్టు బెరడు పొడి. ఇది మనకు మార్కెట్‌లో లభిస్తుంది. లేదా నేరుగా బెరడును అయినా కొనుగోలు చేయవచ్చు. అయితే బెరడు లేదా పొడి ఏదైనా సరే ఒక గ్లాస్ పాలలో వేసి బాగా మరిగించాలి. అనంతరం ఈ పాలను తాగాలి. ఇలా రాత్రిపూట తీసుకోవాలి. అలాగే అర్జున చెట్టు బెరడను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా అర్జున చెట్టు బెరడును రోజూ తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్‌లు రావని చెబుతున్నారు.
ఈ చెట్టు బెరడు ఇతర సమస్యలను కూడా తగ్గిస్తుంది. బీపీని నియంత్రణలోకి తెస్తుంది. షుగర్‌ను కూడా తగ్గించగలదు. అయితే చిన్నారులు, గర్భిణీలు దీన్ని డాక్టర్ల సలహా మేరకు వాడుకోవాలి. ఇక అర్జున చెట్టు బెరడును తీసుకోడం వల్ల ఆస్తమా, దగ్గు కూడా తగ్గుతాయి. అయితే ఇదే కాకుండా రోజూ ఎండు ద్రాక్షలను తీసుకోవడం, బాదంపప్పును నానబెట్టి తినడం, వ్యాయామం చేయడం, వేళకు నిద్రించడం, తగిన పౌష్టికాహారం తీసుకోవడం.. వంటివన్నీ చేస్తుండాలి. దీంతో గుండె ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ లు అసలు రానేరావు. కాదని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారవుతారు. కనుక గుండె ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి.