Cinnamon : మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ఒకటి. ఇది మనందరికి తెలిసిందే. దాల్చిన చెక్కను ఎంతో కాలంగా మనం వంటల్లో ఉపయోగిస్తున్నాం. దాల్చిన చెక్క చక్కటి వాసనను కలిగి ఉంటుంది. దీనిని వాడడం వల్ల వంటల రుచి మరింత పెరుగుతుంది. దాల్చిన చెక్కలో చక్కటి వాసనతో పాటు ఎన్నో ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. దాల్చిన చెక్కను పవర్ హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్లుగా చెప్పవచ్చు. దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. దాల్చిన చెక్క మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు. అయితే ఈ దాల్చిన చెక్కను ఎలా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దీని కోసం మనం ముందుగా చక్కటి నాణ్యమైన దాల్చిన చెక్కను తీసుకుని పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో వేడి నీటిని తీసుకోవాలి. తరువాత ఈ నీటిలో ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి కలపాలి. తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. నీరు గోరు వెచ్చగా అయిన తరువాత దీనిలో ఒక టీ స్పూన్ తేనెను వేసి కలపాలి. నీరు వేడిగా ఉన్నప్పుడు ఇందులో తేనెను వేసుకోకూడదు. ఇలా తయారు చేసుకున్న దాల్చిన చెక్క నీటిని రోజూ ఉదయం పరగపడపున తీసుకోవాలి. ఈ దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల మనం శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ నీటినితాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.
దాల్చిన చెక్కకు శరీరంలో జీవక్రియలను వేగవంతం చేసే శక్తి ఉంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో మెటాబాలిజం పెరిగి మనం త్వరగా బరువు తగ్గవచ్చు. అలాగే నీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్, మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. బీపీని నియంత్రించడంలో, శరీరంలోని వాపులను, నొప్పులను తగ్గించడంలో కూడా ఈ దాల్చిన చెక్క నీరు మనకు ఉపయోగపడుతుంది. తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడే వారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ దాల్చిన చెక్క నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడి మెదడుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
అలాగే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. సంతాన లేమి సమస్యతో బాధపడే స్త్రీ, పురుషులిద్దరూ ఈ దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే దాల్చిన చెక్క నీటిని తాగుతూ, దాల్చిన చెక్కను ఉపయోగించి ముఖానికి మాస్క్ వేసుకోవడం వల్ల వయసు పెరిగినప్పటికి యవ్వనంగా కనిపించవచ్చు. దాల్చిన చెక్క మనకు ఎంతో మేలు చేస్తుందని దాల్చిన చెక్కతో చేసిన నీటిని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.