Mint Leaves : పుదీనా ఆకులను మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. వీటిని వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. పుదీనా ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కనుక వీటిని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నేరుగా అలాగే నమిలి మింగేయాలి. లేదా ఒక కప్పు మోతాదులో పుదీనా ఆకుల రసం కూడా తాగవచ్చు. దీంతో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పుదీనా ఆకులను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణవ్యవస్థ మొత్తం శుభ్రమవుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకుపోతాయి. గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. కడుపులో మంట అనేది ఉండదు. అల్సర్లు ఉన్నా తగ్గిపోతాయి.
2. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు పుదీనా ఆకులను రోజూ తింటుంటే ఫలితం ఉంటుంది. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలు తగ్గుతాయి. శ్వాస సరిగ్గా ఆడుతుంది.
3. పుదీనా ఆకులను నమలడం వల్ల నోట్లో ఉండే బాక్టీరియా మొత్తం నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.
4. పుదీనా ఆకులను తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతుంది. చిన్నారులు అయితే చదువుల్లో రాణిస్తారు.
5. పుదీనా ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చు.
6. ఒత్తిడి, ఆందోళన సమస్యలు ఉన్నవారు పుదీనా ఆకులను తింటే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
7. పాలిచ్చే తల్లులకు స్తనాల్లో నొప్పులు ఉంటే పుదీనా ఆకులను నమిలి తింటుండాలి. దీంతో ఆ నొప్పులు తగ్గిపోతాయి. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఈ ఆకులను తింటే బరువు తగ్గుతారు.
8. పుదీనా చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆకులను పేస్ట్‌లా చేసి నేరుగా చర్మంపై ఫేస్ ప్యాక్‌లా ఉపయోగించవచ్చు. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు పోతాయి. అలాగే గజ్జి, తామర వంటి చర్మవ్యాధులు ఉన్నవారు పుదీనా ఆకుల మిశ్రమాన్ని రాస్తుంటే ఫలితం ఉంటుంది.
9. శిరోజాల సంరక్షణకు కూడా పుదీనా ఆకులు ఉపయోగపడతాయి. పుదీనా ఆకులను పేస్ట్‌లా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి జుట్టుకు బాగా రాయాలి. గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. దీంతో చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. అలాగే వేసవిలో ఇలా చేస్తే మాడు చల్లగా ఉంటుంది. ఎండలో తిరిగినా తల చల్లగా అనిపిస్తుంది.
10. అలర్జీలు, వికారం, వాంతులు వంటి సమస్యలు ఉన్నవారు ఈ ఆకులను నమిలి తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.