Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్యం

గరికగడ్డితో అమోఘమైన ప్రయోజనాలు.. అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు..!

Admin by Admin
August 10, 2021
in ఆరోగ్యం, మూలిక‌లు
Share on FacebookShare on Twitter

మన చుట్టూ పరిసరాల్లోనే అనేక రకాల మొక్కలు ఉంటాయి. కానీ వాటిలో ఔషధ గుణాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి మొక్కల్లో గరిక కూడా ఒకటి. దీన్ని పశువులు ఇష్టంగా తింటాయి. కానీ మనం కూడా దీన్ని వాడవచ్చు. పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. గరికతో ఏయే వ్యాధులను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits and home remedies using garika

1. గరిక గడ్డిని ముద్దగా నూరి నెయ్యి కలిపి మిశ్రమంగా తయారు చేసి దాన్ని చర్మంపై రాస్తుండాలి. దీంతో చర్మంపై ఏర్పడే పొక్కులు తగ్గుతాయి.

2. గరికను దంచి ముద్దగా నూరి దాన్ని రాస్తుంటే గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి.

3. గరిక గడ్డిని పసుపుతో కలిపి ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని రాస్తుంటే దద్దుర్లు, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి.

4. గరిక వేళ్ల కషాయాన్ని 30 ఎంఎల్‌ మోతాదులో రోజూ తీసుకుంటుండాలి. మూత్రంలో మంట తగ్గుతుంది.

5. గరికవేళ్లను దంచి రెండు టీస్పూన్ల ముద్దను ఒక కప్పు పెరుగుకు కలిపి తీసుకోవాలి. మహిళల్లో వచ్చే వైట్‌ డిశ్చార్జి సమస్య తగ్గుతుంది.

6. మూత్రంలో రక్తం పడుతుంటే గరిక రసం ఒకటి లేదా రెండు టీస్పూన్లు లేదా గరిక వేళ్ల కషాయం 30 ఎంఎల్‌ మోతాదులో తీసుకుంటుండాలి.

7. గరికలను తీసుకుని నూరి ముద్దగా చేసి దాన్ని రాస్తుంటే అర్శమొలలు తగ్గుతాయి.

8. పిడికెడు గరికగడ్డి, 2 టీస్పూన్ల జీలకర్ర, ఒక టీస్పూన్‌ మిరియాలను రెండు గ్లాసుల నీటిలో వేసి చిన్న మంటపై మరిగించాలి. అరగ్లాస్‌ కషాయం మిగిలేంత వరకు మరిగించి దాన్ని ప్రతి రోజూ ఉదయం పరగడుపునే 4-5 రోజుల పాటు తీసుకోవాలి. దీంతో జ్వరం, ఫ్లూ తగ్గుతాయి.

9. గరికతో తయారు చేసిన కషాయాన్ని ఒక కప్పు మోతాదులో రెండు పూటలా తీసుకుంటుండాలి. మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి.

10. గరిక ఆకులను ఎండబెట్టి చూర్ణం చేసి నిల్వ చేసుకుని ఒక టీస్పూన్‌ మోతాదుగా అరకప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి. జీర్ణాశయంలో ఉండే అల్సర్లు తగ్గుతాయి.

11. రెండు లీటర్ల గరికగడ్డి రసాన్ని ఒక లీటర్‌ కొబ్బరినూనెలో వేసి నీరంతా ఆవిరయ్యేలా మరిగించి నిల్వ చేసుసుకుని తలనూనెగా వాడుకోవాలి. చుండ్రు తగ్గుతుంది.

12. గరికగడ్డి కషాయంతో పుక్కిట పడుతుంటే నోటిపూత తగ్గుతుంది.

Tags: garikagrassగరికగరికగడ్డి
Previous Post

కళ్ల కింద నల్లని వలయాలు, మొటిమలను తగ్గించుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

Next Post

మెంతుల నీళ్ల‌తో అద్భుత‌మైన ఉప‌యోగాలు.. అనేక వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Related Posts

మూలిక‌లు

ఏయే వ్యాధులను న‌యం చేసేందుకు తుల‌సి ఆకుల‌ను ఎలా వాడాలో తెలుసా..?

March 16, 2025
మూలిక‌లు

ఏయే ఆకులు ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేస్తాయో తెలుసా..?

March 14, 2025
మూలిక‌లు

క‌ర‌క్కాయ‌ల‌తో అద్భుత‌మైన ఆయుర్వేద చిట్కాలు.. ఏయే వ్యాధులు త‌గ్గేందుకు దీన్ని ఎలా ఉప‌యోగించాలంటే..?

February 9, 2025
మూలిక‌లు

పిచ్చి పిచ్చి ఆలోచనలకు వట్టివేర్లతో చెక్ పెట్టొచ్చు!

January 18, 2025
మూలిక‌లు

కింగ్ ఆఫ్ ఆయుర్వేద.. అశ్వగంధ..!

January 3, 2025
మూలిక‌లు

Ashwagandha Benefits : రోజూ ఒక స్పూన్ చాలు.. పురుషుల్లో ఆ శ‌క్తి పెరుగుతుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!

December 18, 2024

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!