LDL Levels : మన శరీరంలో రక్తంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకొకటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. అయితే శరీరంలో ఎల్‌డీఎల్ ఎక్కువైతే మనకు హైబీపీ వస్తుంది. దీని తరువాత రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి అది హార్ట్ ఎటాక్‌ను కలగజేస్తుంది. కనుక ఎల్‌డీఎల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాల మీదకు రావచ్చు. అయితే ఎల్‌డీఎల్ ఎక్కువగా ఉన్నవారు పలు ఆయుర్వేద మూలికలను తీసుకోవడం వల్ల ఆ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. ఇక ఆ మూలికలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎల్డీఎల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు త్రిఫల చూర్ణం లేదా ట్యాబ్లెట్లను తీసుకోవాలి. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల చూర్ణం ఇది. దీన్ని రోజూ తీసుకుంటే ఎల్‌డీఎల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఎల్‌డీఎల్ స్థాయిలను తగ్గించడంలో గుగ్గులు కూడా పనిచేస్తాయి. ఇక వెల్లుల్లి సైతం ఎల్‌డీఎల్ స్థాయిలను తగ్గించగలదు. వీటిల్లో ఆల్లిసిన్ ఉంటుంది. ఇది రక్తనాళాల్లో ఉండే కొవ్వును కరిగిస్తుంది. దీంతో గుండె పోటు రాదు. అదేవిధంగా అర్జున వృక్షానికి చెందిన బెరడు పొడని కూడా వాడవచ్చు.
పసుపులో అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే పసుపును రోజూ తీసుకుంటే ఎల్‌డీఎల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతోపాటు ఉసిరికాయ జ్యూస్ లేదా ఉసిరికాయ పొడిని కూడా వాడవచ్చు. వీటన్నింటినీ ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. దీంతో సరైన ఫలితాలను రాబట్టవచ్చు. అయితే వీటితోపాటు సరైన జీవన విధానం పాటించడం అవసరం. ముఖ్యంగా రోజూ వ్యాయామం చేయడంతోపాటు సరైన ఆహారం తీసుకోవాలి. వేళకు భోజనం చేయాలి. తగినన్ని నీళ్లను తాగడంతోపాటు తగినన్ని గంటలపాటు నిద్రించాలి. ఈ విధంగా చేస్తే ఎల్‌డీఎల్ స్థాయిలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.