Stevia Powder : ఇది షుగ‌ర్‌ను త‌రిమేస్తుంది.. పేగుల్లో ఉన్న చెత్త‌ను బ‌య‌ట‌కు పంపేస్తుంది..!

Stevia Powder : స్టీవియా ఆకులు.. ప్ర‌కృతి ప్ర‌సాదించిన మొక్క‌లల్లో ఇది కూడా ఒక‌టి. ఈ ఆకులు తియ్య‌గా ఉంటాయి. ఈ ఆకుల పొడి మ‌న‌కు మార్కెట్ లో, ఆన్ లైన్ లో విరివిరిగా ల‌భిస్తూ ఉంటుంది. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఈ స్టీవియా ఆకుల పొడిని పంచ‌దార‌కు బ‌దులుగా వాడుచుకోవ‌చ్చు. ఈ ఆకులు పంచ‌దార కంటే 150 రెట్లు ఎక్కువ తీపిగా ఉంటాయి. కానీ పంచ‌దార కంటే ఈ ఆకులు ఎంతో మేలైన‌వి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎటువంటి హాని క‌ల‌గ‌దు. 100 గ్రాముల స్టీవియా ఆకుల పొడిలో 100 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్న‌ప్ప‌టికి ప్రోటీన్, క్యాల‌రీలు, ఫైబ‌ర్, ఫ్యాట్ వంటి పోష‌కాలు ఏ మాత్రం ఉండ‌దు. ఈ ఆకుల్లో కార్బోహైడ్రేట్స్ ఉన్న‌ప్ప‌టికి అవి గ్లూకోసైడ్ రూపంలో ఉంటాయి. క‌నుక వీటిని మ‌న ప్రేగులు జీర్ణం చేయ‌లేవు.

ఒక‌వేళ జీర్ణం అయిన‌ప్ప‌టికి ఇవి మూత్రం ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తాయి. క‌నుక మ‌న‌కు శ‌క్తి ల‌భించ‌ద‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు. వేడి ప‌దార్థాల్లో కూడా ఈ ఆకుల పొడిని మ‌నం వేసుకోవ‌చ్చు. షుగ‌ర్ వ్యాధితో బాధప‌డే వారు పంచ‌దార‌, బెల్లం వంటి వాటిని తీసుకోరు క‌నుక అటువంటి వారు ఈ స్టీవియా పౌడ‌ర్ ను టీ, కాపీ, ల‌స్సీ, జ్యూస్ వంటి వాటిలో వేసుకోవచ్చు. క్యాల‌రీలు పెర‌గ‌కుండా జ్యూస్ ల‌ను తాగాల‌నుకునే వారు కూడా ఈ పొడిని ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే ద‌గ్గు, ఆస్థ‌మా, పిల్లి కూత‌లు, శ్లేష్మాలు ఎక్కువ‌గా ఉండ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడే వారు కూడా పంచ‌దార‌ను ఎక్కువ‌గా తీసుకోరు.

Stevia Powder benefits in telugu take daily
Stevia Powder

అలాంటి వారు కూడా ఈ స్టీవియా పౌడ‌ర్ ను ఉప‌యోగించుకోవ‌చ్చు. అదే విధంగా చాలా మందికి భోజ‌నం చేసిన త‌రువాత ఏదో ఒక స్వీట్ తినాల‌నిపిస్తుంది. అలాంటి వారు పంచ‌దార‌తో చేసే స్వీట్ ల‌ను తిని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవ‌డానికి బ‌దులుగా ఈ స్టీవియా పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తింటే స్వీట్ తిన్న భావ‌న క‌లుగుతుంది. ఆరోగ్యానికి కూడా హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. అదే విధంగా ఈ స్టీవియా పౌడ‌ర్ మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు పరిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు. ఈ స్టీవియా పొడిని వాడ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

అంతేకాకుండా ఈ పొడిని వాడ‌డం వల్ల రొమ్ము క్యాన్స‌ర్, బ్ల‌డ్ క్యాన్స‌ర్ వంటి ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ ల బారిన కూడా ప‌డ‌కుండా ఉంటాము. రోజూ 20 గ్రాముల స్టీవియా పొడిని వాడ‌డం వ‌ల్ల ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఈ విధంగా స్టీవియా పౌడ‌ర్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు దీనిని వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts