Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

అనేక వ్యాధుల‌ను న‌యం చేసే వ‌స‌..! ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Admin by Admin
January 23, 2022
in మూలిక‌లు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ఆయుర్వేదంలో అనేక రకాల మూలికలను ఉపయోగించినట్లే వస ను కూడా ఉపయోగిస్తారు. ఎన్నో వందల ఏళ్ల నుంచే వస ను ఆయుర్వేదంలో వాడుతున్నారు. హిమాలయాల్లో వసకు చెందిన ప్రత్యేకమైన రకం దొరుకుతుంది. వస వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ స‌మ‌స్య‌లు, వాపులు, నొప్పులు, అధిక కొవ్వుకు చెక్ పెట్టే వ‌స‌.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

1. నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరచడంలో వస ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆందోళన, ఒత్తిడి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, కిడ్నీస్టోన్లు వంటి సమస్యలకు వస పనిచేస్తుంది.

2. ఆకలి బాగా తగ్గిన వారు, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారు వస చూర్ణం తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇది జీర్ణాశయంలో అగ్నిని పెంచుతుంది. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది.

3. జీర్ణాశయంలో అల్సర్లకు, గ్యాస్‌, అసిడిటీ సమస్యలకు వస పనిచేస్తుంది. విరేచనాలు, చర్మ సమస్యలు ఉన్నవారు వసను తీసుకోవాలి.

4. వస కొమ్ములు, తుంగముస్తల గడ్డలు, పసుపు, శొంఠి కొమ్ములు కచ్చాపచ్చాగా దంచి నీళ్లకు కలిపి మరిగించి కషాయం కాచి తీసుకోవాలి. దీంతో విరేచ‌నాలు త‌గ్గుతాయి.

5. వసకొమ్ము పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మూర్ఛ తగ్గుతుంది. వసకొమ్ముల పొడిని ఆవనూనెతో కలిపి రాస్తుంటే శరీర భాగాల‌పై ఏర్ప‌డే వాపులు, నొప్పులు త‌గ్గుతాయి.

6. వస చూర్ణాన్ని తేనె, బెల్లంతో కలిపి తీసుకుంటే అసిడిటీ తగ్గుతుంది. వసకొమ్ము, దేవదారు వేరు పట్ట లేదా గురవింద గింజలను ముద్దగా నూరి జుట్టు ఊడినచోట లేపనం చేస్తే జుట్టు పెరుగుతుంది.

జీర్ణ స‌మ‌స్య‌లు, వాపులు, నొప్పులు, అధిక కొవ్వుకు చెక్ పెట్టే వ‌స‌.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

7. వస కొమ్ము వేసి కాచిన నీళ్లతో గాయాలు, పుండ్ల‌ను కడిగి శుభ్రం చేయాలి. దీంతో అవి త్వ‌ర‌గా మానుతాయి.

8. వసకొమ్ములను పాలలోవేసి మరిగించి కనీసం ఒక నెలపాటు తీసుకుంటే మంచి జ్ఞాపకశక్తి వ‌స్తుంది. కంఠ స్వ‌రం చ‌క్క‌గా మారుతుంది.

9. వసకొమ్ములను, సోంపు గింజలను కలిపి నూరి ముద్దగాచేసి అర్శమొలల మీద ప్రయోగించాలి. దీనికి ముందు నువ్వుల నూనెను వేడిచేసి బాహ్యంగా ప్రయోగిస్తే ఉపశమం ల‌భిస్తుంది.

వస చూర్ణం అయితే రోజుకు 1-2 చిటికెలు తీసుకోవచ్చు. భోజనం అనంతరం తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. వస క్యాప్సూల్స్‌ రూపంలోనూ లభిస్తుంది. రోజుకు రెండు సార్లు 1-2 క్యాప్సూల్స్‌ను తీసుకోవచ్చు. జీర్ణ సమస్యలు, అల్సర్లు, కిడ్నీ స్టోన్లు తగ్గుతాయి. వసలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల చర్మ సమస్యలకు పనిచేస్తుంది. ఒక టీస్పూన్‌ వస చూర్ణం తీసుకుని నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి చర్మంపై సమస్య ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది.

ఒక టీస్పూన్‌ వస చూర్ణం, అంతే మోతాదులో త్రిఫల చూర్ణం తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. దాన్ని పొట్ట మీద, తొడలపై కొవ్వు ఉన్న చోట రాయాలి. ఇలా చేస్తుంటే కొవ్వు కరుగుతుంది. వస మనకు ఎసెన్షియల్‌ ఆయిల్‌ రూపంలోనూ లభిస్తుంది. దీన్ని కూడా వాడవచ్చు. వస నూనెలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి రాస్తుంటే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.

Tags: vachavasaవస
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

రోజూ క‌నీసం 6 గంట‌లైనా నిద్రించాలి.. లేక‌పోతే ఎలాంటి దుష్ప‌రిణామాలు క‌లుగుతాయో తెలుసా ?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.