Vetiver Powder : ప్రస్తుత తరుణంలో మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా గాబరా పడడం, ఆందోళన చెందడం, కోపగించుకోవడం వంటి వాటిని కూడా అనారోగ్య సమస్యలుగానే చెప్పవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఈ సమస్యలను మనం చూడవచ్చు. మానసిక ఒత్తిడే వీటన్నింటికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. యోగా, ధ్యానం వంటి వాటిని చేయడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు. యోగా, ధ్యానం వంటి వాటితోనే కాకుండా ఆయుర్వేదం ద్వారా ఎటువంటి దుష్పభ్రావాలు లేకుండా కూడా ఈ సమస్య నుండి మనం బయట పడవచ్చు.
చిన్న చిన్న విషయాలకే పిల్లలు కూడా పెద్ద వారిపై అరుస్తూ ఉంటారు. మూడు సంవత్సరాల చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఎవరైనా ఆయుర్వేదం ద్వారా తయారు చేసిన ఈ ఔషధాన్ని వాడవచ్చు. ఈ ఔషధమే వట్టి వేరు ఒడి (చూర్ణం. దీనిని వాడడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇది కోపాన్ని తగ్గించడమే కాకుండా శరీరంలో వేడిని, వేడి ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే చర్మ, కంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. కొందరిలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు రాలడాన్ని, ముఖం నల్లగా మారడాన్ని మనం గమనించవచ్చు. అలాంటి వారికి కూడా వట్టి వేరుతో చేసిన పొడి ఎంతో సహాయపడుతుంది.
వట్టి వేరు పొడిని మూడు నుండి ఏడు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు పావు టీ స్పూన్, ఏడు నుండి పదహారు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అర టీ స్పూన్, పదహారు సంవత్సరాలు పై బడిన వారు ఒక టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి. మనం తాగే నీటిలో ఈ పొడిని కలుపుకుని రోజంతా తాగవచ్చు. ఇలా చేయడం వల్ల పొట్టలో ఉండే చెడు బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వట్టి వేరు పొడిని కలిపిన నీటిని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.
కొందరిలో ఉదయం పూట మాత్రమే జలుబు చేసినట్టుగా ఉండడం, ఎక్కువగా తుమ్ములు రావడాన్ని మనం గమనించవచ్చు. అలాంటి వారు రాత్రి పూట పాలల్లో వట్టి వేరు పొడిని, తేనెను కలిపి తాగడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. మహిళలు రాత్రి పూట నీళ్లల్లో వట్టి వేరు పొడిని కలుపుకొని తాగడం వల్ల హార్మోన్ అసమతుల్యత వల్ల కలిగే సమస్యల నుండి బయట పడవచ్చు.
వట్టి వేరు పొడిని నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల మూత్రాశయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. ఈ వట్టి వేరు పొడిని కనీసం 120 రోజులపాటు నీళ్లల్లో కలుపుకొని తాగడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.