వాతావరణంలో మార్పులు వస్తుంటే సహజంగానే చాలా మందికి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. దగ్గు, జలుబు, ఫ్లూ బారిన పడుతుంటారు. దీంతోపాటు గొంతు సమస్యలు, ఛాతి పట్టేయడం, జ్వరం, ముక్కు కారడం, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే ఇవన్నీ ఫ్లూ లక్షణాలు. అందువల్ల ఫ్లూను తగ్గించుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
1. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీటిని గొంతులో పోసుకుని పుక్కలిస్తుండాలి. రోజుకు 3 సార్లు చేయాలి. దీంతో గొంతు సమస్యలు, ఛాతి పట్టేడయం తగ్గుతాయి. మ్యూకస్ కరుగుతుంది. గొంతు సమస్యలు తగ్గుతాయి.
2. దాల్చిన చెక్క, పెప్పర్‌మింట్, లెమన్, యూకలిప్టస్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ను వాడుతుండాలి. ఏ ఆయిల్‌ను సరే తీసుకుని గొంతుపై అప్లై చేసి మర్దనా చేయాలి. ఇలా చేస్తుంటే శ్వాస సమస్యలు తగ్గుతాయి. ఫ్లూ నుంచి బయట పడవచ్చు.
3. జింక్ ఎక్కువగా ఉండే మాంసం, పప్పు దినుసులు, చేపలు, బీన్స్, సీడ్స్, కోడిగుడ్లను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అవి సూక్ష్మ క్రిములతో పోరాడుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు వెంటనే తగ్గుతాయి.
4. తేనెలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల బాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా అది పోరాడుతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఫ్లూ ను తగ్గించేందుకు తేనె బాగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె కలిపి రోజుకు 3 సార్లు తాగాలి. దీని వల్ల ఫ్లూ, ఇతర సమస్యలు త్వరగా తగ్గుతాయి.
5. అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు వెల్లుల్లిని ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లిలో ఆల్లిసిన్ ఉంటుంది. ఇది యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల వైరస్‌లు, బాక్టీరియా నశిస్తాయి. అధ్యయనాల ప్రకారం వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఫ్లూతోపాటు ఇతర శ్వాసకోశ సమస్యలను తగ్గించుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బను పూటకు ఒకటి చొప్పున తింటుండాలి. లేదా వెల్లుల్లితో డికాషన్ తయారు చేసుకుని తాగవచ్చు. దీంతో ఫ్లూ, దగ్గు, జలుబు, గొంతు సమస్యలు తగ్గుతాయి.
శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ద్రవాలను ఎక్కువగా తీసుకుంటుండాలి. నూనె పదార్థాలను బాగా తగ్గించాలి. బాగా ఆవిరి పట్టాలి. హెర్బల్ టీని తాగుతుండాలి. దీంతో ఫ్లూ నుంచి, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకుంటారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365