Acidity And Gas Trouble : మనకు సులభంగా లభించే ఈ పదార్థంతో చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల 80 కు పైగా అనారోగ్య సమస్యలను మనం నయం చేసుకోవచ్చు. క్యాల్షియం లోపం, ఎముకలు బలహీనంగా ఉండడం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, అధిక రక్తపోటు, శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, నరాల బలహీనత వంటి సమస్యలన్నింటిని ఈ చిట్కాను వాడడం వల్ల నయం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ చిట్కాను వాడడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. చేతులు, కాళ్లల్లో మంటలు, తిమ్మిర్లు వంటి సమస్యలతో బాధపడే వారు కూడా ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలను కూడా ఈ చిట్కాను వాడడం నయం చేసుకోవచ్చు.
మన అనారోగ్య సమస్యలన్నింటిని దూరం చేసే ఈ చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి..ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈచిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ధనియాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ధనియాలు.. ఇవి మనందరికి తెలిసినవే. దాదాపు ప్రతి ఒక్కరి వంటగదిలో ఇవి ఉంటాయి. వంటల్లో వీటిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. ధనియాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ధనియాలతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి గానూ చక్కటి నాణ్యమైన ధనియాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి.
తరువాత అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని 4 నుండి 5 నిమిషాల పాటు మరిగించి వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ నీటిని కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తాగాలి. ఈ విధంగా ధనియాల కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. రక్తనాళాలు శుభ్రపడతాయి. నరాల్లో పేరుకుపోయిన అడ్డంకులు తొలగిపోతాయి. అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే గుండె సమస్యలు, అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు ఈ నీటిని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ధనియాల్లో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. కనుక ధనియాల కషాయాన్ని తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి.
కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు ధృడంగా మారతాయి. తిమ్మిర్ల సమస్య తగ్గుతుంది. రక్తహీనత సమస్య మన దరి చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ ధనియాల కషాయాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గు ముఖం పడతాయి. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అదే విధంగా ధనియాల నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ విధంగా ధనియాల కషాయం మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.