Almonds Powder : ప్రస్తుత కాలంలో చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో కంటి చూపు మందగించడం కూడా ఒకటి. కంటి చూపు తగ్గడానికి చాలా కారణాలు ఉంటున్నాయి. టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్ల వాడకం ఎక్కువ కావడం, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి వాటితోపాటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కూడా కంటి చూపు మందగిస్తోంది. పూర్వకాలంలో ఈ సమస్యను మనం పెద్దవారిలో మాత్రమే చూసే వాళ్లం. కానీ ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలల్లో కూడా మనం ఈ సమస్యను చూస్తున్నాం. ఈ సమస్య నుండి బయటపడడానికి వైద్యులు మనకు కళ్ల జోడును సూచిస్తారు.
కళ్ళజోడును వాడే పని లేకుండానే ఆయుర్వేదం ద్వారా కూడా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మన ఇంట్లో ఉండే వాటితో ఒక పొడిని తయారు చేసి వాడడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి చూపును పెంచే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. ఈ పొడిని ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పొడిని తయారు చేసుకోవడానికి మనం 50 గ్రాముల బాదం పప్పును, 50 గ్రాముల సోంపు గింజలను, 50 గ్రాముల పటిక బెల్లాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా బాదం పప్పును ఒక రాత్రంతా వేడి నీటిలో వేసి నానబెట్టాలి. తరువాత పొట్టు తీసి ఎండబెట్టి దంచి పొడిగా చేసుకోవాలి.
తరువాత సోంపు గింజలను కూడా వేయించి పొడిగా చేసుకోవాలి. అదే విధంగా పటిక బెల్లాన్ని కూడా పొడిగా చేయాలి. ఇప్పుడు ఈ మూడు చూర్ణాలను కలిపి తడి లేని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పిల్లలలు అయితే ఒక టీ స్పూన్ మోతాదులో, పెద్దలు అయితే రెండు టీ స్పూన్ల మోతాదులో ఒక గ్లాస్ ఆవు పాలలో కలుపుకుని రోజుకు రెండు పూటలా తీసుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు చేయడం వల్ల కళ్ల అద్దాలు వాడే పని లేకుండానే కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ పొడిని వాడడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని.. పిల్లలు చదువుల్లో రాణిస్తారని.. నిపుణులు చెబుతున్నారు.