చిట్కాలు

Hair Growth : దీన్ని రాస్తే చాలు.. మీ జుట్టు వేగంగా పెరుగుతుంది.. అస‌లు న‌మ్మ‌లేరు..!

Hair Growth : వాజ‌లిన్‌ను ఎవ‌రైనా చ‌లికాలంలో చ‌ర్మం ప‌గిలితే వాడుతార‌ని అంద‌రికీ తెలిసిందే. ఇక కొంద‌రికైతే కాలాల‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ చ‌ర్మం ప‌గులుతూ ఉంటుంది. దీంతో వారు అన్ని కాలాల్లోనూ వాజ‌లిన్‌ను ఉప‌యోగిస్తారు. అయితే వాజ‌లిన్‌తో నిజానికి ఈ ఒక్క ఉప‌యోగం మాత్ర‌మే కాదు, మ‌రో ఉప‌యోగం కూడా ఉంది. అదేమిటంటే.. వాజ‌లిన్ స‌హాయంతో మీ జుట్టును రోజుకు ఒక అంగుళం వ‌రకు పెంచుకోవ‌చ్చు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

వాజ‌లిన్‌ను ఉప‌యోగించి త‌యారు చేసే ఓ మిశ్ర‌మాన్ని వాడ‌డం వ‌ల్ల మీ జుట్టు రోజుకు ఒక ఇంచు పెరుగుతుంద‌ట‌. అలా అని చెప్పి దీన్ని వాడిన వారే ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. అయితే మ‌రి ఆ మిశ్ర‌మాన్ని త‌యారు చేయ‌డం ఎలా.. అంటే.. అది ఎలాగో కింద చూడండి.

applying Vaseline can increase hair growth

వాజ‌లిన్ మిశ్ర‌మం త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

బాదం నూనె (ఆల్మండ్ ఆయిల్‌) – స‌రిపోయినంత, విటమిన్ ఇ క్యాప్సూల్స్ – 400 ఎంజీ 2 క్యాప్సూల్స్, వాజిలిన్ పెట్రోలియం జెల్లీ – ఏదయినా జెల్లీ స‌రిపోయినంత తీసుకోవ‌చ్చు.

త‌యారీ విధానం..

ఒక పాత్ర‌లో ఒక టీస్పూన్ వాజ‌లిన్ పెట్రోలియం జెల్లీ తీసుకోవాలి. అందులో 2 టీ స్పూన్ల‌ ఆల్మండ్ ఆయిల్ ని వేయాలి. వెంట్రుక‌లు బాగా ఉన్న‌వారైతే వారి హెయిర్ కి సరిపడినంతగా ఆయిల్ కూడా వేయ‌వచ్చు. ఇక ఆ మిశ్ర‌మంలో రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ ని కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకవేళ 600ఎంజీ విటమిన్ ఇ క్యాప్సూల్ వాడాలనుకుంటే మాత్రం ఒక్కటే కట్ చేసుకుని అందులోని పదార్థాన్ని బౌల్ లోకి పిండుకోవాలి.

ఇక‌ బౌల్ లోకి తీసుకున్న పైన చెప్పిన మూడు పదార్థాలనూ బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయ‌గా వ‌చ్చే మిశ్ర‌మాన్ని మూడు ఫింగర్ టిప్స్ (మూడు చేతి వేళ్ల సహాయం) తో తలపై మాడుకు పట్టించాలి. మాడుకు మర్దనా అయ్యేలా సర్క్యులర్ మోషన్ లో ఈ మిశ్ర‌మాన్ని అప్లై చేయాలి. అనంత‌రం మిశ్ర‌మం డ్రై కాగానే త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే క‌చ్చితంగా వెంట్రుక‌లు పొడ‌వుగా పెరుగుతాయి. మ‌రింకెందుకాల‌స్యం.. వెంట‌నే ఈ మెథ‌డ్‌ను ఫాలో అయిపోండి మ‌రి.

Admin

Recent Posts