Bad Breath : నోరు తాజాగా ఉండాలని, నోరు దుర్వాసన రాకుండా ఉండాలని మనలో చాలా మంది మౌత్ వాష్ లను ఉపయోగించి నోటికి శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయితే మౌత్ వాష్ లను నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల మనం వివిధ రకాల దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మౌత్ వాష్ లను నోట్లో పోసుకుని ఒక నిమిషం పాటు పుక్కిలించి ఉమ్మి వేస్తూ ఉంటాము. ఈ మౌత్ వాష్ లను చాలా తక్కువ సమయమే ఉపయోగించినప్పటికి వీటిని వాడడం వల్ల ముఖ్యంగా మనం నాలుగు రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మౌత్ వాష్ లల్లో ఉండే ఆల్కాహాల్ నోట్లో జిగురు తక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. నోట్లో జిగురు ఉత్పత్తి అవ్వడం కూడా చాలా అవసరం. ఆహారాన్ని నమిలేటప్పుడు ఆహారం సులభంగా కదలడానికి, నోట్లో చెడు బ్యాక్టీరియా శాతం పెరగకుండా చేయడంలో జిగురు సహాయపడుతుంది. మౌత్ వాష్ లను వాడడం వల్ల జిగురు ఉత్పత్తి తగ్గి నోటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలాగే మౌత్ వాష్ లల్లో ఉండే సోడియం లారిల్ సల్పేట్ కారణంగా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ రసాయనం వల్ల హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే మౌత్ వాష్ లను వాడడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. దంతాలపై ఎనామిల్ దెబ్బతినడం వల్ల దంతాలు పుచ్చడం, దంతాలు సున్నితంగా మారడం వంటివి జరుగుతాయి. అలాగే కొంతమంది భోజనం తీసుకోవడానికి ముందుగా మౌత్ వాష్ తో నోటిని శుభ్రం చేసుకుంటారు. తరువాత భోజనం తింటారు. ఇలా చేయడం వల్ల మౌత్ వాష్ లో ఉండే రసాయనాలు మన పొట్టలోకి వెళ్లి ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. కనుక మనం మౌత్ వాష్ లను ఉపయోగించడం అంత మంచిది కాదు. మౌత్ వాష్ లకు బదులుగా రెండు రకాల నూనెలను వాడడం వల్ల నోరు తాజాగా, దుర్వాసన రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మౌత్ వాష్ లకు బదులుగా మనం పిప్పర్ మెంట్ ఆయిల్ ను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయిల్ ను 4 లేదా 5 చుక్కల మోతాదులో నీటిలో వేసి కలిపి పుక్కిలించాలి. ఇలా పుక్కిలించడం వల్ల నోరు తాజాగా ఉంటుంది. దీనిని ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే టీ ట్రీ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. దీనిని కూడా 4 లేదా 5 చుక్కల మోతాదులో నీటిలో కలిపి పుక్కిలించాలి. ఇలా చయేడం వల్ల నోరు తాజాగా, దుర్వాసన రాకుండా ఉంటుంది. మౌత్ వాష్ లకు బదులుగా సహజ సిద్దంగా లభించే ఈ నూనెలను వాడడం వల్ల నోరు తాజాగా , దుర్వాసన రాకుండా ఉండడంతో పాటు దుష్ప్రభావాలు కూడా ఉండవని నిపుణులు చెబుతున్నారు.