సాధారణంగా ఎవరైనా సరే తమ శిరోజాలు మృదువుగా, కాంతివంతంగా కనిపించాలని కోరుకుంటారు. దీనికి తోడు ఆరోగ్యంగా ఉండాలని కూడా భావిస్తారు. కానీ జుట్టును కాంతివంతంగా కనిపించేలా చేసుకోవడం సులభమే. అయితే చుండ్రు సమస్య ఉంటే మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. కనుక ముందు చుండ్రును తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కింద తెలిపిన పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం ద్వారా చుండ్రు సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…
2. చిన్న అల్లం ముక్క తీసుకుని సన్నగా కట్ చేయాలి. ఈ ముక్కలను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తరువాత కుదుళ్లకు నూనె పట్టేలా మర్దనా చేయాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. వారంలో ఒక్కసారి ఈ విధంగా చేసినా చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు.
3. యాపిల్ సైడర్ వెనిగర్‌ను 2 టీస్పూన్ల మోతాదులో తీసుకుని దానికి కొద్దిగా అరటి పండు గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి తలకు పట్టించాలి. 30 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. దీంతో కూడా చుండ్రు తగ్గుతుంది.
4. నారింజ పండు తొక్కను సేకరించి దాన్ని బాగా నూరి పేస్ట్‌లా చేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. తరువాత గంట సేపు అలాగే ఉండాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో 2 నుంచి 3 సార్లు చేస్తే సమస్య తగ్గుతుంది.
5. ఒక కప్పు నీటిలో 2-3 టేబుల్ స్పూన్ల ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 10 నిమిషాల పాటు ఉంచి తరువాత తలస్నానం చేయాలి. వారంలో ఒక రోజు ఇలా చేస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది.
6. బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్‌ను చుట్టుకోవాలి. 15 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారంలో 2 సార్లు ఇలా చేయడం వల్ల చుండ్రును తగ్గించుకోవచ్చు.
7. కలబంద గుజ్జును తలకు బాగా పట్టించి 15 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. కలబంద చుండ్రును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీంతోపాటు జుట్టుకు మృదుత్వం లభిస్తుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.
8. 2 టేబుల్ స్పూన్ల యాపిల్ జ్యూస్‌ను తీసుకుని అంతే మొత్తంలో నీటిని కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. తరువాత 30 నిమిషాలపాటు ఆగి తలస్నానం చేయాలి.
9. విటమిన్ ఎ, సి, ఇ ఉన్న ఆహారాలను బాగా తినడంతోపాటు దుమ్ము, ధూళిలో తిరిగినప్పుడు తలకు రక్షణ క్యాప్‌లు ధరించడం వల్ల చుండ్రు సమస్య ఉత్పన్నం కాకుండా చూసుకోవచ్చు.