కళ్ల కింద నల్లని వలయాలు, మొటిమలను తగ్గించుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

కళ్ల కింద నల్లని వలయాలు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోవడం, కళ్లద్దాలను ధరించడం.. వంటి కారణాల వల్ల కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. ఇక దీంతోపాటు చాలా మందికి మొటిమల సమస్యలు కూడా ఉంటాయి. అయితే అలాంటి వారు కింద తెలిపిన పలు ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే ఆ రెండు సమస్యల నుంచి ఒకేసారి బయట పడవచ్చు. ఒకే దెబ్బకు రెండు పిట్టలనే సామెత ప్రకారం.. ఒకేసారి రెండు సమస్యలను తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..

ayurvedic remedies for dark circles and pimples

1. ఒక పాత్రలో నీటిని బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటి నుంచి వచ్చే ఆవిరిని ముఖానికి 8-10 నిమిషాల పాటు పట్టించాలి. ఇలా రోజుకు ఒకసారి చేస్తే వారం రోజుల్లో తప్పక ఫలితం కనిపిస్తుంది. మొటిమలు, నల్లని వలయాలు తగ్గుతాయి.

2. వేప పువ్వులను కొన్ని తీసుకుని నూరి ముద్దలా చేయాలి. అందులో కొద్దిగా పసుపు, వెన్న కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని మొటిమలు లేదా నల్లని వలయాలపై రాయాలి. తరువాత 60 నిమిషాలు ఉండి కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే వారం రోజుల్లోనే ఆ రెండు సమస్యలు తగ్గుతాయి.

3. పోక చెక్కను నీళ్లతో గంధం తీసి ముఖానికి పట్టించి 3 గంటల తరువాత కడిగేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

4. ఉసిరికాయ గుజ్జు, తమలపాకుపై రాసే కాచు కలిపి అందులో బాదం పాలు కలిపి చూర్ణం చేసి పావు టీస్పూన్‌ మోతాదులో తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి. తెల్లని మచ్చలకు కూడా ఇది పనిచేస్తుంది.

5. పాల మీగడలో పసుపు, పొట్లకాయ పై పొట్టు, నువ్వులు కలిపి ముఖానికి రాసుకుంటే అన్ని రకాల మొటిమలు తగ్గుతాయి. నల్లని వలయాలు మాయమవుతాయి. ముఖం అందంగా మారుతుంది.

Share
Admin

Recent Posts