Baking Soda Coconut Oil : ముఖం కడుక్కోవడమనేది మనం రోజూ చేసే రెగ్యులర్ పనుల్లో ఒకటి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. మనం దేంతో ముఖం కడుగుతున్నాం అని. అదే విషయం ఓ సారి పరిశీలిస్తే.. మనం చాలా రకాలైన ప్రొడక్ట్స్‌నే అందుకు వాడుతాం. యాడ్స్ లో చూసి, ఎవరో చెప్పింది విని, ఎక్కడో చదివి రక రకాల ప్రొడక్ట్స్‌ను ముఖం కడిగేందుకు వాడుతాం. కానీ వాటిలో ఉండే కెమికల్స్ మన ముఖానికి ఎంత హాని చేస్తాయన్నది మాత్రం ఆలోచించం. మరి ఆ ప్రొడక్ట్స్‌ను వాడకపోతే ఎలా..? ముఖం కాంతివంతంగా ఎలా మారుతుంది..? ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు ఎలా పోతాయి..? అనేకదా మీరు అడిగేది.
అయితే అందుకు పరిష్కారం ఉంది. మన ఇంట్లో ఉండే రెండు పదార్థాలతో తయారు చేసే ఈ మిశ్రమాన్ని వాడితే ముఖ సౌందర్యం పెరుగుతుంది. అంతేకాదు, ముఖంపై ఉండే మచ్చలు కూడా పోతాయి. ఇంతకీ ఆ పదార్థాలు ఏమిటి..? ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక బౌల్ తీసుకుని అందులో అర టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ కొబ్బరి నూనెను కలపాలి. అయితే సెన్సిటివ్ చర్మం ఉన్న వారు 1/4 టీస్పూన్ బేకింగ్ సోడా వాడినా చాలు. ఇలా చెప్పిన మోతాదులో రెండు పదార్థాలను కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని ముఖమంతటా రాయాలి. ఒక నిమిషం ఆగాక వేడిగా ఉన్న నాప్‌కిన్ టవల్‌తో తుడిచేయాలి. దీంతో తేడా కచ్చితంగా తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పైన చెప్పిన విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకుని తరచూ వాడుతుంటే దాంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మం మృదువుగా ఉంటుంది. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు పోతాయి. అవి ఉండేవని తేడా కూడా తెలియనంతగా ముఖం మారుతుంది. రెగ్యులర్‌గా ఈ మిశ్రమాన్ని వాడితే పొడి చర్మం సమస్య ఉండదు. చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. ముఖంపై ఉండే చర్మం పీహెచ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
ముఖం చర్మం లోపల ఉండే రక్త నాళాల్లో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో ముఖ సౌందర్యం పెరుగుతుంది. అయితే ఈ మిశ్రమాన్ని వాడే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడవాలి. ఆ తరువాతే దీన్ని అప్లై చేసి మంచి ఫలితం పొందవచ్చు. ఈ క్రమంలో ఈ మిశ్రమం వెంట్రుకలకు మాత్రం తగలకూడదు. లేదంటే వెంట్రుకలు అంతా జిడ్డుగా మారుతాయి.